Tuesday, October 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 100



diTacheDi

3-698-క.
దిచెడి లోఁబడె దైత్యుఁడు
టికిన్ దంష్ట్రా విభిన్న త్రు మహోర
స్తటికిన్ ఖరఖురపుటికిం
టి తట హత కమలజాండ టికిం గిటికిన్.
          అలా సముద్ర గర్భంలో జరుగుతున్నపోరాటంలో – పటుత్వాలు జారిపోయిన ఆ దితి కశ్యపుల కొడుకు హిరణ్యాక్షుడు లొంగిపోయాడు. అతనికి ఆ ఆదివరాహ స్వామి మెడమీద వేళ్ళాడే జూలుతో, దుండగుల గుండెలు బద్దలుకొట్టే కోరలుతో, వాడి గిట్టలుతో, బ్రహ్మాం భాండాన్ని పెటపెటలాడించే కటిప్రదేశంతో అతి భీకరంగా కనిపించాడు.
3-698-ka.
diTacheDi lO@MbaDe daityu@MDu
saTikin daMshTraa vibhinna Satru mahOra
staTikin kharakhurapuTikiM
gaTi taTa hata kamalajaaMDa ghaTikiM giTikin.
               దిట = పటుత్వము; చెడి = తప్పిపోయి; లోబడెన్ = లొంగెను; దైత్యుడు = హిరణ్యాక్షుడు {దైత్యుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యాక్షుడు}; సటి = వర హావతారుని {సటి – జూలు కలది, అడవిపంది}; కిన్ = కి; దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటి = వరహావతారుని {దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటి - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలు కొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము}; కిన్ = కి; ఖర ఖుర పుటి = వరహావతారుని {ఖర ఖుర పుటి - ఖర (వాడి) యైన ఖుర (గిట్టలు) యొక్క పుటి (నేర్పు గల నడక కలది), ఆదివరాహము}; కిన్ = కి; కటితట హత కమలజాండ ఘటి = వరహావతారుని {కటితట హత కమలజాండ ఘటి - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (భాండము కలది), ఆదివరాహము}; కిన్ = కి {కమలజాండము - కమల (పద్మము)న జ (పుట్టిన వాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కిటి = వరహావతారుని; కిన్ = కి;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: