Tuesday, October 22, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 93

9-582 akka talli

9-582-ఆ.
అక్క తల్లి చెల్ల లాత్మజ యెక్కిన
పాను పెక్కఁ జనదు ద్మనయన!
పరమయోగికైన లిమిని నింద్రియ
గ్రామ మధికపీడఁ లుగఁ జేయు.
          ఒకరోజు జ్ఞానోదయ మయి విరక్తి మార్గం చెందిన యయాతి తన భార్య దేవయానితో బస్తోపాఖ్యానం వ్యాజేతిహాసం చెప్పి వానప్రస్థాశ్రమం చేపడతా నంటూ యిలా చెప్పసాగాడు – ఓ పద్మా ల్లాంటి కన్ను లున్న దేవయాని! మహా యోగీశ్వరుల కయినా సరే ఇంద్రియాలు బలవంత మై కీడు చేస్తాయి. అందుచేత కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లి యెక్కిన మంచం ఎక్క కూడదు.
9-582-aa.
akka talli chella laatmaja yekkina
paanu pekka@M janadu padmanayana!
paramayOgikaina balimini niMdriya
graama madhikapeeDa@M galuga@M jaeyu.
          అక్క = పెద్ద సోదరి; తల్లి = అమ్మ; చెల్లెలు = చిన్న సోదరి; ఆత్మజ = కూతురు; ఎక్కిన = ఎక్కి నట్టి; పానుపున్ = మంచము పైకి; ఎక్క జనదు = ఎక్క రాదు; పద్మనయన = పద్మాక్షీ; పరమ = మహా; యోగి = ఋషి; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; బలిమినిన్ = బలవంతముగా; ఇంద్రియ = ఇంద్రియముల; గ్రామము = సమూహము; అధిక = మిక్కిలి; పీడన్ = చీకాకులు; కలుగజేయున్ = కలుగచేస్తాయి .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: