akkaTa
1-164-ఉ.
అక్కట! పుత్త్ర శోక జనితాకుల భార విషణ్ణచిత్త నై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చు ఎలాట సహింపని దై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?
పోయిన బిడ్డల పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఏడుస్తు ఇక్కడ ఉన్నాను. అట్లాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చా డన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామ! అలాగే అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఇంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుంది కదా.
పోయిన బిడ్డల పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఏడుస్తు ఇక్కడ ఉన్నాను. అట్లాగే పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చా డన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామ! అలాగే అక్కడ మీ అమ్మ కూడా తట్టుకోలేక ఇంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుంది కదా.
రాత్రి చీకటిలో నిద్రిస్తున్న
ద్రౌపది పుత్రు లైన ఉపపాండవుల తలలు నరికేసిన అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి కృష్ణార్జునులు
ఆమె ఎదుట పడేసారు. అప్పటి ఆమె పలుకులలోని
పద్యం ఇది. ఈ సందర్భం ‘తనకు బాధ కలిగేది ఇతరులకు చేయకుండా ఉండటం ధర్మం’ అన్నది
మరువని ధర్మవర్తనుల ధర్మపత్ని వర్తన, పాండవుల ధర్మ ఔన్నత్యం ఎంతటిదో సూచిస్తోంది.
1-164-u.
akkaTa!
puttra SOka janitaakulabhaara vishaNNachittanai
pokkuchu
nunna bhaMgi ninu@M bOra@M gireeTi nibaddhu@M jaesi nae@M
DikkaDa
keeDchi techchuTa sahiMpanidai bhavadeeya maata, nae@M
DekkaDa niTTi
SOkamuna naekriya naeDchuchu@M bokkuchunnadO?
అక్కట = అయ్యో;
పుత్త్రశోక = పుత్రులు పోయిన దుఃఖము వలన; జనిత = పుట్టిన; ఆకుల = బాధ యొక్క; భార = భారముతో; విషణ్ణ = దుఃఖ పడిన; చిత్తన్ = మనసు కల దానను; ఐ = అయ్యి; పొక్కుచున్ = కుమిలిపోతూ; ఉన్న = ఉన్నట్టి; భంగిన్ = విధముగా; నినున్ = నిన్ను; పోరన్ = యుద్ధములో; కిరీటి = అర్జునుడు; నిబద్ధున్ = బంధింపబడిన వానిగా; చేసి = చేసి; నేఁడు = ఇవాళ; ఇక్కడ = ఇక్కడ; కున్ = కు; ఈడ్చి = లాక్కొంటూ; తెచ్చుటన్ = తీసుకొచ్చుటను; సహింపనిది = ఓర్చుకో లేనిది; ఐ = అయ్యి; భవదీయ = మీ యొక్క; మాత = తల్లి; నేఁడు = ఇవాళ; ఎక్కడన్ = ఎక్కడ; ఇట్టి = ఇలాంటి; శోకమున = దుఃఖముతో; ఏ = ఏ; క్రియన్ = విధముగా; ఏడ్చుచున్ = ఏడుస్తూ; పొక్కుచు = కుమిలిపోతూ; ఉన్నదో = ఉన్నదో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment