Thursday, October 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 102



dharaNiduhitRraMtaa

11-126-మా.
ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
11-126-maa.
dharaNiduhitRraMtaa! dharmamaargaanugaMtaa!
nirupamanayavaMtaa! nirjaraaraatihaMtaa!
gurubudhasukhakartaa! kOsalakshONibhartaa!
surabhayaparihartaa! soorichaetOvihartaa!
          భూదేవి పుత్రిక యైన సీతాదేవిని ఆనందింప జేయు వాడా! ధర్మమార్గాన్ని సదా అనుసరించిన వాడా! సాటిలేని నీతిమంతుడా! దేవతల శత్రువు లైన రాక్షసులను సంహరించిన వాడా! కోసల దేశ రాజ! దేవతల భయమును పోగొట్టిన వాడ! పండితుల హృదయాలలో విహరించు వాడ! శ్రీరామ! – ఇది ఏకాదశ స్కంధాంత ప్రార్థనా పద్యం. పోతన కృత స్కంధాలు తొమ్మిది (దశమ రెండు భాగాలు విడిగా గణించి) మరియు నారయల కృత స్కందాలు రెంటి స్కంధాంత ప్రార్థనలలో ఒక్కొక్క మాలిని వృత్తం ఉన్నాయి. బొప్పన కృత పంచమ స్కంధ పూర్వాశ్వాసాంత ప్రార్థనలో మాలిని వాడి, ద్వితీయాశ్వాసాంత ప్రార్థనలో మాలిని బదులు మత్తకోకిల వాడబడింది. ఏర్చూరి సింగన కృత షష్ఠస్కంధాంత ప్రార్థనలో మాలిని బదులు తోటకము ప్రయోగించ బడింది. ఈ విధంగా తెలుగు భాగవతము మొత్తంలో పన్నెండు (12) మాలిని వృత్తాలు స్కంధాంత ప్రార్థనలలో వాడబడింది.
          ధరణి దుహితృ రంతా = శ్రీరామా {ధరణి దుహితృ రంత – ధరణి దుహితృ (భూదేవి పుత్రికతో) రంత (క్రీడించు వాడు), రాముడు}; ధర్మమా ర్గానుగంతా = శ్రీరామా {ధర్మమా ర్గానుగంత - ధర్మమార్గమును అనుగంత (అనుసరించు వాడు), రాముడు}; నిరుపమ నయవంతా = శ్రీరామా {నిరుపమ నయవంత - నిరుపమ (సాటిలేని) నయవంత (నీతి కల వాడు), రాముడు}; నిర్జ రారాతి హంతా = శ్రీరామా {నిర్జ రారాతి హంత - నిర్జర అరాతి (రాక్షసులను) హంత (సంహరించిన వాడు), రాముడు}; గురు బుధ సుఖ కర్తా = శ్రీరామా {గురు బుధ సుఖ కర్త - గురువులకు బుధ (పండితులకు) సుఖమును కర్త (కలిగించు వాడు), రాముడు}; కోసల క్షోణి భర్తా = శ్రీరామా {కోసల క్షోణి భర్త - కోసల అనెడి క్షోణి (రాజ్యాని)కి భర్త (రాజు), రాముడు}; సుర భయ పరిహర్తా = శ్రీరామా {సుర భయ పరిహర్త -సుర (దేవతల) భయమును పరిహర్త (పోగొట్టు వాడు), రాముడు}; సూరి చేతో విహర్తా = శ్రీరామా {సూరి చేతో విహర్త - సూరి (పండితుల) చేతస్ (హృదయాల)లో విహర్త (విహరించే వాడు), రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: