tOyaruhOdaraaya
4-920-ఉ.
తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః! పరే
శాయ సరోజకేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృ
ష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే.
అబేధ ధర్మము గల పదిమంది ప్రచేతస్సుల తపస్సుకి సంతోషించి
విష్ణుమూర్తి ప్రత్యక్ష మయ్యాడు. వారు స్తుతిస్తున్నారు – పద్మనాభునికి; సంసార
దుఃఖాన్ని పోగొట్టువానికి; అధి దేవునికి; పద్మాల పుప్పొడి వంటి పచ్చని రంగు గల బంగారు వస్త్రాలు ధరించు
వానికి; పద్మపాదునికి; పద్మ మాలికలు ధరించు వానికి; నీల వర్ణునికి; ఇహపరాలు రెండు
అయిన వానికి; సర్వ సుగుణాలు గల వానికి; రాక్షసుల
సంహరించే వానికి; సృష్టి మూలకారణునికి నమస్కారము చేయుచున్నాము.
ప్రతీకలు = పద్మం –
సృష్టి, వికాసం, విజ్ఞానం; ఉదరం – వ్యక్తం కావటానికి హేతువు; పద్మనాభం – ఆది
వికాసానికి కారణభూతం; సంసార దుఃఖ హరం – పునర్జన్మ రాహిత్యం; పద్మాల
పుప్పొడి - జ్ఞానం; బంగారు వస్త్రం – శ్రేష్ఠ మైన ఆవరణ; పద్మపాదం - వికాసాలకి
ఆధారభూతం; పద్మమాలిక - విజ్ఞానం సర్వస్వం; నీలవర్ణ -ఆకాశ
తత్వం; పరాపరం – ద్వైతాద్వైతాలు; సుగుణ
– త్రిగుణ అతీతం; రాక్షస సంహారం
– అతి రజోగుణ హరణం; వేధస్ అంటే ప్రకృతి పురుష ఆవిర్భావ కారణభూతం; నమః – అభిన్నత్వం,
అసత్తు; ప్రచేతస్సులు అబేధ ధర్ములు పదిమంది – పంచేంద్రియ పంచతన్మాత్ర జన్య జ్ఞానం; తపస్సు – అకుంఠిత
సాధన; విష్ణువు - విశ్వవ్యాపకత్వం; స్తుతించడం – స్మరణ.
4-920-u.
tOyaruhOdaraaya
bhavadu@hkhaharaaya namO nama@h! parae
Saaya
sarOjakaesara piSa~mga vinirmala divya bharma va
straaya
payOja sannibha padaaya sarOruha maalikaaya kR
shNaaya
paraaparaaya suguNaaya suraariharaaya vaedhasae!
తోయరు హోదరాయ = విష్ణుమూర్తి {తోయరు హోదరుడు - తోయరుహము (పద్మము) ఉదరుడు (గర్భమున గల వాడు),
విష్ణువు}; భవ దుఃఖ హరాయ = విష్ణుమూర్తి {భవ దుఃఖ హరు - భవ (సంసారము) యొక్క దుఃఖములను హరుడు (హరించెడి వాడు),
విష్ణువు}; నమో నమః = నమస్కారము; పరేశాయ = విష్ణుమూర్తి {ప రేశుడు - పర (అత్యున్నత మైన) ఈశుడు (దైవము), విష్ణువు}; సరోజ కేసర పిశఙ్గ వినిర్మల
దివ్య భర్మ వస్త్రాయ = విష్ణుమూర్తి {సరోజ కేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వస్త్రుడు - సరోజల (పద్మము) కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల
వినిర్మల (స్వచ్చ మైన) దివ్య (దివ్య మైన) భర్మ (బంగారు)
వస్త్రుడు (బట్టలు ధరించిన వాడు), విష్ణువు}; పయోజ సన్నిభ పదాయ = విష్ణుమూర్తి {పయోజ సన్నిభ పదుడు - పయోజ (పద్మము) సన్నిభ (సమాన మైన) పదుడు (పాదములు గల
వాడు), విష్ణువు}; సరోరుహ మాలికాయ = విష్ణుమూర్తి {సరోరుహ మాలికుడు - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించిన వాడు, విష్ణువు}; కృష్ణాయ = విష్ణుమూర్తి {కృష్ణుడు - కృష్ణ (నల్లనివాఢు) అయిన వాడు}; పరాపరాయ = విష్ణుమూర్తి {పరాపరుడు - పరము అపరమూ కూడ అయిన వాడు, పరలోకములకే
పర మైన వాడు, విష్ణువు}; సుగుణాయ = విష్ణుమూర్తి {సుగుణుడు – సుగుణములు గల వాడు, విష్ణువు}; సురారి హరాయ = విష్ణుమూర్తి {సురారి హరుడు - సురారుల (రాక్షసుల)ను హరుడు (సంహరించు వాడు),
విష్ణువు}; వేధసే = విష్ణుమూర్తి {వేధసే – సృష్టికి కర్త యైన వాడు, విష్ణువు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment