Thursday, October 17, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 88

8-103 aDigeda nani

8-103-క.
డిగెద నని కడువడిఁ జను
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్
వెవెడ సిడిముడి తడఁబడ
డు గిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.
8-103-ka.
aDigeda nani kaDuvaDi@M janu
naDigina@M danu maguDa nuDuga@M Dani naDa yuDugun
veDaveDa siDimuDi taDa@MbaDa
naDu giDu; naDugiDadu jaDima naDu giDuneDalan.
          కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి – ఎందుకు వెళ్తున్నాడో అడగాలి అని వేగంగా అడుగులు ముందుకు వేసేది. అడిగితే సమాధానం చెప్పడేమో అని నడక మానేసేది. చీకాకుతో కూడిన తొట్రుబాటు వలన మళ్ళీ ముందుకు అడుగు వేసేది. మళ్ళీ ఆగేది. అలా నడిచే టప్పుడు తడబడుతూ అడగులు వేసేది.
          అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగి నప్పటికిని; తను = అతను; మగుడ = మారు పలుకులు; నుడువుడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: