mammu@M beMDli
10.1-689-ఆ.
మమ్ముఁ బెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణ మిచ్చి కావు భక్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్న నాటి పెండ్లి పెండ్లి కాదు.
కాళింది మడుగులో కాలకూటం విషం కక్కే భీకర మైన కాళీయ సర్పరాజాన్ని కృష్ణుడు
మర్ధిస్తున్నాడు. అతని భార్యలు మొర పెట్టుకుంటున్నారు – భక్తులకు
వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియు డైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి, అతనితో
మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం కాదు. ఇప్పుడు నీవు
మాకు చేసే కల్యాణమే శాశ్వతంగా ఉండేది, క్షేమకర మైనది
10.1-689-aa.
mammu@M beMDli chaeyu maa praaNavallabhu
praaNa michchi kaavu bhaktavarada!
neevu
chaeyu peMDli nityaMbu bhadraMbu
pinna naaTi peMDli peMDli kaadu.
మమ్మున్ = మమ్ములను; పెండ్లిచేయుము = కల్యాణవంతులను చేయుము; మా = మా యొక్క; ప్రాణవల్లభు = భర్త యొక్క; ప్రాణమున్ = ప్రాణమును; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; భక్తవరద = కృష్ణా {భక్తవరదుడు -
భక్తుల కోరికలు తీర్చు వాడు, విష్ణువు}; నీవు = నీవు; చేయు = చేసెడి; పెండ్లి = కల్యాణము; నిత్యంబు = శాశ్వత మైనది; భద్రంబు = మే లైనది; పిన్న నాటి = చిన్నప్పటి; పెండ్లి = పెళ్శి; పెళ్ళి = కల్యాణము అని చెప్ప దగినది; కాదు = కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment