Monday, October 7, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 79

తెలుగు భాగవత తేనె సోనలు - 79

1-272 paMchabaaNuni

1-272-మత్త.
పంబాణుని నీఱు సేసిన ర్గునిం దన విల్లు వ
ర్జించి మూర్ఛిల్లఁ జేయఁ జాలు విశేష హాస విలోక నో
దంచి దాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవుం
సంలింపఁగ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా!
          శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి వచ్చిన సందర్భంలో అతని వనితల స్థితిని సూతుడు శౌనకునికి వర్ణిస్తున్నాడు – ఓ సుధీసత్తమా! మన్మథుని మూడోకంటి మంటతో నుసి చేసిన పరమ శివుని సైతం విల్లు పడేసి మూర్ఛపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహర మైన దేహాలు కల వాళ్ళు అయ్యి కూడ ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయ లేకపోయారు.
1-272-matta.
paMchabaaNuni nee~ru saesina bharguniM dana villu va
rjiMchi moorChilla@M jaeya@M jaalu viSaesha haasa vilOka nO
daMchi daakRtulayyu@M gaaMtalu daMbhachaeshTala maadhavuM
saMchaliMpa@Mga jaeya naemiyu@M jaalarairi budhOttamaa!
          పంచబాణుని = మన్మథుని {పంచబాణుడు - ఐదు బాణముల వాడు, మన్మథుడు}; నీఱు = భస్మము; సేసిన = చేసిన; భర్గునిన్ = శివుని; తన = తనయొక్క; విల్లు = ధనస్సు; వర్జించి = వదిలివేసి; మూర్ఛిల్లన్ = మూర్చ పోవునట్లు; చేయన్ = చేయుటకు; చాలు = సరిపడ; విశేష = విశిష్టమైన; హాస = నవ్వులు; విలోకన = చూపులు; ఉదంచిత = మిక్కిలి శోభ కలిగిన; ఆకృతులు = ఆకారములు కలవారు; అయ్యున్ = అయినప్పటికిని; కాంతలు = స్త్రీలు; దంభ = కపట; చేష్టలన్ = చేష్టలతో; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, కృష్ణుడు}; సంచలింపఁగన్ = మనసుని చలింపగా; చేయన్ = చేయుటకు; ఏమియున్ = ఏమాత్రము; చాలరు = చాలనివారు; ఐరి = అయ్యిరి; బుధోత్తమా = ఙ్ఞానులలో శ్రేష్ఠుడా / శౌనకుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: