Thursday, October 10, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 82

10.1-1706 Sreeyutamoorti

10.1-1706-ఉ.
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుత మైన భవ త్ప్రతాపమున్.
          అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశాన్ని శ్రీకృష్ణునికి విన్నవిస్తున్నాడు – పురుషులలో సింహము వంటి వాడ! మంగళమూర్తీ! సింహానికి చెందవలసిన పదార్థాన్ని నక్క ఆశించి నట్లు, నీ చరణసరోజాలను స్మరించే నన్ను, మదోన్మత్తు డైన శిశుపాలుడు శీఘ్రమే పట్టుకుపోతా నం టున్నాడు. అల్పులలో అల్పు డైనట్టి ఆ చేది దేశపు రాజు ఆశ్చర్య జనక మైన నీ పరాక్రమం ఎరుగడు సుమా.
10.1-1706-u.
Sreeyutamoorti! yO purushasiMhama! siMhamupaali sommu gO
maayuvu gOru chaMdamuna mattu@MDu chaidyu@MDu nee padaaMbuja
dhyaayini yaina nannu vaDi@M daa@M gonipOyeda naMchu nunnavaa@M
Daa yadhamaadhamuM De~ru@Mga@M Dadbhutamaina bhavatprataapamun
శ్రీ = మంగళకరములతో; యుత = కూడి యున్న; మూర్తి = స్వరూపుడా; = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కలి గర్వము కల వాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపు వాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించు దానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకు పోయెదను; అంచున్ = అనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

SD said...

Greetings
I would like to use the bhagavatam to write articles for someone. I plan to cut and paste the pothan poems from your telughubhagavatam website. I hope it is OK with you. PLease remove the word verification for comments. It is a pain. Thanks
DG

vsrao5- said...

Yes sir. You can use them. Plesse use copy paste. Donot cut. I may not able to again load it. Thanks for the interest shown.