తెలుగు భాగవత
తేనె సోనలు – 81
5.1-128 atula divyaanna
5.1-128-తే.
అతుల దివ్యాన్న మైన మృష్టాన్న మైన
నెద్ధి వెట్టిన జిహ్వకు హితముగానె
తలఁచి భక్షించుఁ గా; కొండుఁ
దలఁచి మిగులఁ
బ్రీతి చేయఁడు రుచు లందుఁ బెంపుతోడ.
లేడి పిల్ల మీద వ్యామోహంతో మరణించిన భరతుడు, మరు జన్మలో బ్రహ్మ జ్ఞానంతో
బ్రాహ్మణుల ఇంట పుట్టాడు. అతడు ఎంతో రుచికర మైన చక్కటి అన్నం పెట్టిన, పాసిపోయిన అన్నం
పెట్టిన కాదనకుండ ఒకే విధంగా స్వీకరించేవాడు. అంతే కాని ఇంకోలా చూసి రుచుల కోసం అర్రులు చాచే వాడు కాదు.
5.1-128-tae.
atula
divyaanna maina mRshTaanna maina
neddhi
veTTina jihvaku hitamugaane
tala@Mchi
bhakshiMchu@M gaa; koMDu@M dala@Mchi migula@M
breeti
chaeya@MDu ruchulaMdu@M beMputODa.
అతుల = సాటిలేని; దివ్య = దివ్య మైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; మృష్ట = రుచికర మైన; అన్నమున్ = ఆహారము; ఐనన్ = అయినను; ఎద్ది = ఏది; పెట్టినన్ = పెట్టి నప్పటికిని; జిహ్వ = నాలుక; కున్ = కు; హితమున్ = ఇష్టము; కానె = అగు నట్లు; తలచి = భావించి; భక్షించున్ = తినును; కాక = కాని; ఒండు = మరి యొక విధముగ; తలచి = భావించి; మిగులన్ = మిక్కలి; ప్రీతి చేయడు = ఇష్టపడడు; రుచులు = రుచులు; అందున్ = ఎడల; పెంపు = అతిశయము; తోడన్ = తోటి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment