maguvaa
10.1-321-క.
మగువా! నీ కొమరుఁడు మా
మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం
దగ జీరి పొందు నడిగెను
జగముల ము న్నిట్టి శిశువు చదువంబడెనే?
10.1-321-ka.
maguvaa! nee
komaru@MDu maa
magavaa raTu
pOva@M joochi maMtanamunakuM
daga jeeri
poMdu naDigenu
jagamula mu
nniTTi SiSuvu chaduvaMbaDenae?
ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు
బైటికెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం
వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా
విన్నామా? గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ
పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత
బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని
పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)
మగువా = ఇంతీ; నీ = నీ యొక్క; కొమరుడు = పుత్రుడు; మా = మా యొక్క; మగవారు = భర్తలు; అటున్ = అలా; పోవన్ = వెళ్ళడం; చూచి = చూసి; మంతనమున = రహస్యమున; కున్ = కు; తగన్ = చక్కగా; చీరి = పిలిచి; పొందు = కూడుటను; అడిగెను = అడిగెను; జగములన్ = లోకము లందు; మున్ను = ఇంతకు పూర్వము; ఇట్టి = ఇటువంటి; శిశువున్ = పిల్ల వానిని; చదువం బడెనే = ఎక్కడైనా చెప్పబడెనా, లేదు కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment