Tuesday, October 8, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 80



తెలుగు భాగవత తేనె సోనలు – 80

1-412 Kailaasaachala

1-412-శా.
కైలాసాచల సన్నిభం బగు మహా గంభీర గోరాజముం
గాక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు క్రూరుండు జం
ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁ డై
నేలం గూలంగఁ దన్నెఁ బంచితలఁగా నిర్ఘాత పాదాహతిన్.
          కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమ మైన ఆ మహా వృషభాన్ని క్రోధో న్మత్తుడు, కఠోర చిత్తుడు, రాజవేషధారి, దుడ్డుకర్ర పట్టుకొన్న వాడు, బలమైన పిక్కలు కల వాడు అయిన ఒక శూద్రుడు కటిక రక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభ రాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. – పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తు, ఇలా శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు.
1-412-Saa.
Kailaasaachala sannibhaM bagu mahaa gaMbheera gOraajamuM
gaalakrOdhu@MDu daMDahastu@MDu nRpaakaaruMDu krooruMDu jaM
ghaaluM Dokka@MDu Soodru@M DaasuragatiM gaaruNyanirmuktu@MDai
naelaM goolaMga@M danne@M baMchitala@Mgaa nirghaata paadaahatin.
1-412-శా. | కైలాస = కైలాస; అచల = పర్వతమునకు; సన్నిభంబు = సమానము; అగు = అయి నట్టి; మహా = చాలా; గంభీర = గంభీర మైన; గో = ఎద్దులలో; రాజమున్ = శ్రేష్ట మైన దానిని; కాల = మిక్కిలి; క్రోధుఁడు = కోపిష్టి; దండ = దుడ్డుకర్రను; హస్తుఁడు = చేత పట్టుకున్న వాడు; నృప = రాజు యొక్క; ఆకారుండు = ఆకారమున ఉన్న వాడు; క్రూరుండు = క్రూరుడు; జంఘాలుండు = వడిగ నడచు వాడు {జంఘాలుడు = పిక్క గట్టి కల వాడు}; ఒక్కఁడు = ఒకడు; శూద్రుఁడు = శూద్రుడు; ఆసుర = అసురుని; గతిన్ = వలె; కారుణ్య = దయను; నిర్ముక్తుఁడు = విడిచిన వాడు; = అయ్యి; నేలన్ = నేలమీద; కూలంగన్ = కూలిపోవు నట్లు; తన్నెన్ = తన్నెను; పంచితలఁగాన్ = మూత్రము జారగ {పంచితలము గోమూత్రము}; నిర్ఘాత = పిడుగుపాటు వంటి; పాద = కాలి; హతిన్ = తన్నుతో.
                                               ~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: