hala
3-85-క.
హల కులిశ జలజ రేఖా
లలిత శ్రీకృష్ణ పాద లక్షిత యై ని
ర్మలగతి నొప్పెడు ధరణీ
లలనామణి నేఁ డభాగ్య లక్షణ యయ్యెన్.
శ్రీకృష్ణ
స్వస్థాన గమన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్టి మహా పురుషుడు ఉద్ధవుడు.
శ్రీకృష్ణ వియోగ శోకాగ్ని తప్తు డౌతు వెళ్ళి విదురుని దర్శించి శ్రీకృష్ణ
నిర్యాణం, దుఃఖంతో పూడకుపోతున్న కంఠంతో తెలుపుతున్నాడు – హలము, వజ్రము,
పద్మము మున్నగు రేఖలతో అంద మైన నందనందనుని అడుగుల ముద్రలతో స్వచ్చంగా సలక్షణంగా
ప్రకాశించే భూదేవి ఈరోజు దౌర్భగ్యలక్షణాలు కలది అయిపోయింది.
3-85-ka.
hala kuliSa
jalaja raekhaa
lalita Sree krishna paada lakshita yai ni
rmalagati
noppeDu dharaNee
lalanaamaNi
nae@M Dabhaagya lakshaNa yayyen.
హల = నాగలి; కులిశ = వజ్రము; జలజ = పద్మము; రేఖ = రేఖలతో; లలిత = మనోజ్ఞ మైన; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ భగవానుని; పాద = పాదములచే; లక్షిత = ముద్రింపబడినది; ఐ = అయ్యి; నిర్మల = నిర్మల మైన; గతిన్ = విధముగ; ఒప్పెడు = ఒప్పి ఉండే; ధరణీ = భూమి అను; లలనామణి = దేవి; నేడు = ఇవాళ; అభాగ్య = భాగ్యము లేని; లక్షణ = లక్షణములు కలది; అయ్యెన్ = ఆయిపోయినది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment