gajanaamadhaeya
1-438-క.
గజనామధేయపురమున
గజరిపుపీఠమున ఘనుఁడు గలిదమనుం డ
గ్గజవైరిపరాక్రముఁ డై
గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్.
సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు ఆయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీను డై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా
పరిపాలించాడు. – ఈ పద్యం
నడకలోని వయ్యారాలు తిలకించారు కదా.
1-438-ka.
gajanaamadhaeyapuramuna
gajaripupeeThamuna
ghanu@MDu galidamanuM Da
ggajavairiparaakramu@M
Dai
gajibiji
laekuMDa@M daalche@M gauravalakshmin.
గజ = హస్తిన అను; నామధేయ = పేరు కల; పురమునన్ = పురమున {గజ నాధేయ పురము – హస్తినాపురము}; గజ = ఏనుగు; రిపు = శత్రువు (సింహము); పీఠమునన్ = ఆసనమున {గజ రిపు పీఠము - సింహాసనము}; ఘనుఁడున్ = గొప్పవాడు; కలి = కలిని; దమనుండున్ = శిక్షించిన వాడును; గజ = ఏనుగు; వైరి = శత్రువు (సింహ); పరాక్రముఁడు = పరాక్రమము కలవాడు {గజ వైరి పరాక్రముడు - సింహపరాక్రముడు}; ఐ = అయ్యి; గజిబిజి = గజిబిజి / గందరగోళం; లేకుండన్ = లేకుండగ; తాల్చెన్ = ధరించెను; గౌరవ = గౌరవము అను, కౌరవ సామ్రాజ్యం అను; లక్ష్మిన్ = సంపదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment