Tuesday, October 1, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 72

peTTiri vishaanna

3-13-క.
పెట్టిరి విషాన్న; మంటం
ట్టిరి ఘనపాశములను; గంగానదిలో
నెట్టిరి; రాజ్యము వెడలం
గొట్టిరి; ధర్మంబు విడిచి కుటిలాత్మకు లై.
3-13-ka.
peTTiri vishaanna; maMTaM
gaTTiri ghanapaaSamulanu; gaMgaanadilO
neTTiri; raajyamu veDalaM
goTTiri. dharmaMbu viDichi kuTilaatmakulai.
          శుకుడు పరీక్షిత్తునకు అసూయా మగ్ను లైన కౌరవులు పాండవుల యెడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు – ధర్మదూరులు కుటిల బుద్దులు అయ్యి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు, గంగానదిలోకి నెట్టారు. రాజ్యంనుండి వెళ్ళ గొట్టారు.
          పెట్టిరి = పెట్టిరి; విష = విషము కలిపిన; అన్నమున్ = భోజనమును; అంటన్ = గట్టిగా; కట్టిరి = కట్టివేసిరి; ఘన = పెద్ద; పాశములన్ = తాళ్ళతో; గంగా = గంగ అను; నది = నది; లోన్ = లోనికి; నెట్టిరి = తోసివేసిరి; రాజ్యమున్ = రాజ్యమునుండి; వెడలంగొట్టిరి = గెంటివేసిరి; ధర్మంబు = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; కుటిల = వంకర; ఆత్మకులు = స్వభావము కలవారు; = అయ్యి.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: