Sunday, October 6, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 78



తెలుగు భాగవత తేనె సోనలు - 78

8-95 ala vaikuMTha puraMbulO

8-95-మ.
వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్ప పర్యంక రమావినోది యగు నాన్న ప్రసన్నుండు వి
హ్వనాగేంద్రము "పాహి పాహి" యనఁ గుయ్యాలించి సంరంభి యై.
          కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు.
8-95-ma.
ala vaikuMTha puraMbulO nagarilO naa moola saudhaMbu daa
pala maMdaara vanaaMta raamRta sara@h praaMtaeMdu kaaMtOpalO
tpala paryaMka ramaavinOdi yagu naapanna prasannuMDu vi
hvala naagaeMdramu "paahi paahi" yana@M guyyaaliMchi saMraMbhi yai.
అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరి = రాజ భవన సముదాయము; లోన్ = అందు; = ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత శిల; ఉప = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించు చున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అను; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడు తున్న వాడు; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

10 comments:

Seenu said...

వైకుంఠం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది ఈ పద్యం చదువుతుంటే.. జై శ్రీమన్నారాయణ..

Unknown said...

అమృత ధార జాలువారినట్టు ఉంది ఈ పద్యం

Anonymous said...

ఇంత బాగా పద్యము,ప్రతిపదార్ధము ఇచ్చినందుకు ధన్యవాదాలు. ��

Unknown said...

ప్రతిపదార్థం చాలా బాగుంది.

Unknown said...

ఇలాంటివి నేటిపల్లలకు వేర్పించేవారు ఎందరున్నారు? నమో నారయణాయ.

Anonymous said...

Jai srimannarayana🙏🙏🙏

Anonymous said...

Om namo narayana ya🙏🙏🙏

Anonymous said...

Om namo narayanaya namo namaha miku jayamu jayamu 🙏🙏🙏

Anonymous said...

Thank you for urs content

Anonymous said...

JAI SRIMANNARAYANA
AUM NAMO BHAGAWATE VASUDEVAYA