balavaMtu@MDa
7-262-క.
బలవంతుఁడ నే జగముల
బలములతోఁ జనక వీరభావమున మహా
బలుల జయించితి; నెవ్వని
బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై.
7-262-ka.
balavaMtu@MDa
nae jagamula
balamulatO@M
janaka veerabhaavamuna mahaa
balula
jayiMchiti; nevvani
balamuna
naaDedavu naaku@M brativeeru@MDa vai.
హిరణ్యాక్షుడు
ప్రహ్లాదుడిని ధిక్కరించి ప్రశ్నిస్తున్నాడు – బాలకా! లోకా
లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి. సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి
ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి. అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ
చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు.
బలవంతుడ = శక్తిశాలిని; నేన్ = నేను; జగములన్ = లోకములలో; బలముల = సైన్యముల; తోన్ = తోటి; చనక = వెళ్ళక; వీరభావమునన్ = శూరత్వముతో; మహా = మిగుల; బలులన్ = బలవంతులను; జయించితిన్ = నెగ్గితిని; ఎవ్వని = ఎవని; బలమునన్ = దన్నుతో; ఆడెదవు = పలికెదవు; నా = నా; కున్ = కు; ప్రతివీరుడవు = ఎదిరించెడి శూరుడవు; ఐ = వలె.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment