Thursday, April 7, 2016

దేవతల నరసింహ స్తుతి - తీండ్ర మగు

7-345-క.
తీండ్ర మగు రోషమున మీ
తండ్రి నిమిత్తమునఁ జక్రి దారుణమూర్తిన్
వేండ్రము విడువఁడు మెల్లన
తండ్రీ! శీతలునిఁ జేసి యచేయఁగదే.
టీకా:
          తీండ్రము = ప్రచండమైనది; అగు = అయిన; రోషమునన్ = కోపముతో; మీ = మీ; తండ్రి = తండ్రి; నిమిత్తమునన్ = కారణముచేనైన; చక్రి = విష్ణువు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; దారుణ = భయంకరమైన; మూర్తిన్ = రూపమును; వేండ్రము = తాపమును; విడువడు = వదులుటలేదు; మెల్లన్ = మెల్లిగా; తండ్రీ = నాయనా; శీతలునిన్ = చల్లబడినవానిగా; చేసి = చేసి; దయచేయగదే = అనుగ్రహింపుము.
భావము:
            నాయనా! ప్రహ్లాదా! చక్రాయుధముగా కలవాడైన విష్ణుమూర్తి నీ తండ్రి కారణంగా తీవ్రతరమైన కోపం గలిగిన ఉగ్ర రూపం ధరించాడు. ఇంకా ఆ తాపం వదలటంలేదు. మెల్లిగా దరిచేరి స్వామిని శాంతింప చెయ్యి.”
७-३४५-क.
तींड्र मगु रोषमुन मी
तंड्रि निमित्तमुनँ जक्रि दारुणमूर्तिन्
वेंड्रमु विडुवँडु मेल्लन
तंड्री! शीतलुनिँ जेसि दयचेयँगदे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: