7-363-సీ.
కామహర్షాది సంఘటితమై
చిత్తంబు; భవదీయ
చింతనపదవి చొరదు;
మధురాదిరసముల మరగి చొక్కుచు జిహ్వ; నీ వర్ణనమునకు నిగుడనీదు;
సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి; తావకాకృతులపైఁ దగులుపడదు;
వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు; వినవు యుష్మత్కథావిరచనములు;
7-363.1-తే.
ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు; దవులు
గొలుపదు వైష్ణవధర్మములకు;
నడఁగి యుండవు కర్మేంద్రియములు
పురుషుఁ; గలఁచు, సవతులు గృహమేధిఁ గలఁచు
నట్లు.
టీకా:

భావము:
ఈ చిత్తం ఉందే కామం,
హర్షం మున్నగు గుణాలతో నిండి ఉండి, నీ చింతన
మార్గంలో ప్రవేశించదు; నాలుక మాధుర్యం మొదలైన రుచులకు అలవాటు
పడి, నీ నామ స్మరణామృతం రుచి చూడదు; కన్నులు
కామినీ ముఖం చూడాలని కోరుతాయి, కానీ నీ దివ్యమంగళమూర్తిని దర్శించటానికి
లగ్నం కావు; రకరకాల దుర్భాషలు వినగోరే ఈ చెవులు, నీ కథలను వినవు; నాసిక దుర్వాసనలకేసి పోవటానికి
అలవాటు పడి, వైష్ణవ ధర్మ సుగంధాలు ఆఘ్రాణించదు; గృహస్థును సవతులు అందరూ చుట్టుముట్టి వేపుకు తిన్నట్లు, కర్మేంద్రియాలు నిత్యం పురుషుడిని బాధిస్తాయి.
७-३६३-सी.
कामहर्षादि संघटितमै चित्तंबु; भवदीय चिंतनपदवि चोरदु;
मधुरादिरसमुल मरगि चोक्कुचु जिह्व; नी वर्णनमुनकु निगुडनीदु;
सुंदरीमुखमुलँ जूडँगोरेडि जूड्कि; तावकाकृतुलपैँ दगुलुपडदु;
विविध दुर्भाषलु विनँ गोरु वीनुलु; विनवु युष्मत्कथाविरचनमुलु;
७-३६३.१-ते.
घ्राण मुरवडिँ दिरुगु दुर्गंधमुलकु; दवुलु गोलुपदु वैष्णवधर्ममुलकु;
नडँगि युंडवु कर्मेंद्रियमुलु पुरुषुँ; गलँचु, सवतुलु गृहमेधिँ गलँचु नट्लु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment