Friday, April 29, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – సకలభావములను

7-370-ఆ.
కలభావములను సాధులు విధ్వాంసు
ఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ
గోర్కు లిమ్మటంచుఁ గోరుదు రిచ్చెదఁ
గోరు మెద్ది యైనఁ గుఱ్ఱ! నీవు."
టీకా:
          సకల = అఖిలమైన; భావములన్ = విధములచేతను; సాధులు = సజ్జనులు, దేవతలు; విద్వాంసులు = జ్ఞానులు; అఖిల = సమస్తమైన; భద్ర = క్షేమకరమైన; విభుడన్ = ప్రభువును; ఐన = అయిన; నన్నున్ = నన్ను; కోర్కులు = కోరికలు; ఇమ్ము = ఇవ్వవలసినది; అని = అని; అటంచున్ = అనుచు; కోరుదురు = అడిగెదరు; ఇచ్ఛెదన్ = ఇచ్ఛెదను; కోరుము = కోరుకొనుము; ఎద్ది = ఏది; ఐనన్ = అయినను; కుఱ్ఱ = పిల్లవాడ; నీవు = నీవు.
భావము:
            సకల శుభప్రదాతను నేను. నన్ను సాదువులూ, విద్వాంసులూ ఎన్నెన్నో రకాల కోరికలు కోరుతుంటారు. వారి కోరికలు తీరుస్తుంటాను. వత్సా! నీవు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: