7-347-ఉ.
ప్రాభవ
మొప్ప నుత్కటకృపామతియై కదియంగఁ జీరిఁ సం
శోభిత
దృష్టిసంఘములఁ జూచుచు
బాలుని మౌళి యందు లో
కాభినుతుండు
పెట్టె నసురాంతకుఁ డుద్భట కాలసర్ప భీ
తాభయదాన
శస్తము ననర్గళ మంగళ హేతు హస్తమున్.
టీకా:
ప్రాభవము
= ఠీవి; ఒప్పన్ = ఒప్పుచుండగా; ఉత్కట = అతిశయించిన; కృపా = కరుణా; మతి = హృదయుడు; ఐ
= అయ్యి; కదియంగన్ = దగ్గరకు; చీరి =
పిలిచి; సంశోభిత = మిక్కిలి ప్రకాశించెడి; దృష్టిన్ = కన్నుల; సంఘములన్ =
సమూహములతో; చూచుచున్ = చూచుచు; బాలుని
= పిల్లవాని; మౌళిన్ = తల; అందున్ = పైన; లోకాభిరతుండు = నరసింహస్వామి {లోకాభిరతుడు - లోకములచే అభిరతుడు (కీర్తింపబడువాడు), నరసింహుడు}; పెట్టెన్ = పెట్టెను; అసురాంతకుండు = నరసింహస్వామి {అసురాంతకుడు - అసుర
(రాక్షసుని) అంతకుడు (చంపినవాడు), నరహరి}; ఉద్భట = క్రూరమైన; కాల = కాలము యనెడి; సర్పమున్ = పామునకు; భీత = భయపడినవారికి; అభయ = అభయమును; దాన = ఇచ్చెడి; శస్తమున్ = శ్రేష్ఠమైనదానిని; అనర్గళ = అడ్డులేని;
మంగళ = శుభములకు; హేతున్ = కారణమైనదానిని;
హస్తమున్ = చేతిని.
భావము:
నరహరి మనసులో కరుణ ఉప్పొంగింది; చిన్న పిల్లవాడు
ప్రహ్లాదుడిని దగ్గరకు పిలిచాడు; వాత్యల్యపురస్సరంగా చూస్తూ,
ఆ రాక్షస సంహారి తన హస్తంతో మస్తకాన్ని ఆప్యాయంగా నిమిరాడు.
ప్రశస్తమైన ఆ హస్తం కాలసర్ప భయాన్ని తొలగించేది; నిత్యమంగళం
ప్రసాదించేది.
७-३४७-उ.
प्राभव मोप्प नुत्कटकृपामतियै कदियंगँ जीरिँ सं
शोभित दृष्टिसंघमुलँ जूचुचु बालुनि मौळि यंदु
लो
काभिनुतुंडु पेट्टे नसुरांतकुँ डुद्भट कालसर्प
भी
ताभयदान शस्तमु ननर्गळ मंगळ हेतु हस्तमुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment