7-337-వ.
విష్ణుసేవకు లిట్లనిరి.
7-338-ఉ.
సంచిత
విప్రశాపమునఁ జండనిశాచరుఁ
డైన వీని శి
క్షించుట కీడు
గాదు కృప జేసితి
వీశ్వర! భక్తితోడ సే
వించుటకంటె
వైరమున వేగమ
చేరఁగ వచ్చు నిన్ను; నీ
యంచిత
నారసింహ తను వద్భుత
మాపదఁ బాసి రందఱున్.
టీకా:
విష్ణు =
విష్ణుని; సేవకులు = కింకరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
సంచిత = పూర్వజన్మమునార్జింపబడిన; విప్ర = బ్రాహ్మణ; శాపమునన్ = శాపముచేత; చండ = క్రూరమైన; నిశాచరుడు = రాక్షసుడు; ఐన = అయిన; వీని = ఇతనిని; శిక్షించుట
= దండించుట; కీడు = అపకారము; కాదు = కాదు;
కృప = కరుణ; చేసితివి = చూపితివి; ఈశ్వర = నరసింహా; భక్తి =
భక్తి; తోడన్ = తోటి; సేవించుట =
సేవించుట; కంటెన్ = కంటె; వైరమునన్ =
విరోధముతోటి; వేగమ = శ్రీఘ్రమే; చేరగవచ్చున్
= పొందవచ్చును; నిన్నున్ = నిన్ను;
నీ = నీ యొక్క; అంచిత = చక్కనైన; నారసింహ = నరసింహుని; తనువు = దేహము; అద్భుతము = ఆశ్చర్యకరము; ఆపదన్ = అపాయమును; పాసితిరి = తొలగించితిరి; అందఱున్ = అందరును.
భావము:
విష్ణుభక్తులు ఇలా వినుతులు చేసారు.
“ప్రభూ! విష్ణుమూర్తీ! విప్రులు సనక సనందాదుల ఘోరమైన శాపం వల్ల, క్రూరులైన దానవులుగా జన్మించారు జయవిజయులు. అలా హిరణ్యకశిపునిగా జన్మించిన
వాడిని నువ్వు ఇప్పుడు చంపి, కీడు కాదు మేలే చేశావు. ఘోరాతి
ఘోరాలు చేసిన వాడు ఇవాళ నీచేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. భక్తితో కంటే
శత్రుత్వంతోనే నిన్ను వేగంగా చేరవచ్చు కదా! నీ ఈ నరకేసరి స్వరూపం పరమ అద్భుతమైనది.
అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది.”
७-३३७-व.
विष्णुसेवकु लिट्लनिरि.
७-३३८-उ.
संचित विप्रशापमुनँ जंडनिशाचरुँ डैन वीनि शि
क्षिंचुट कीडु गादु कृप जेसिति वीश्वर! भक्तितोड से
विंचुटकंटे वैरमुन वेगम चेरँग वच्चु निन्नु; नी
यंचित नारसिंह तनु वद्भुत मापदँ बासि रंदर्रु
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment