7-368-వ.
కావున భవదీయ దాస్యయోగంబుఁ గృపజేయు" మని ప్రణతుండైన ప్రహ్లాదుని
వర్ణనంబులకు మెచ్చి నిర్గుణం డయిన హరి రోషంబు విడిచి; యిట్లనియె.
7-369-శా.
"సంతోషించితి
నీ చరిత్రమునకున్ సద్భద్ర
మౌఁగాక నీ
యంతర్వాంఛితలాభ
మెల్లఁ గరుణాయత్తుండనై యిచ్చెదం
జింతం జెందకు భక్తకామదుఁడ నే సిద్ధంబు
దుర్లోక్యుఁడన్
జంతుశ్రేణికి
నన్నుఁ జూచినఁ బునర్జన్మంబు
లే దర్భకా!
టీకా:
కావునన్ = కనుక; భవదీయ
= నీ యొక్క; దాస్య = సేవచేసికొనుట; యోగంబున్
= లభించుతెరువు; కృపజేయుము = దయతోకలిగింపుము; అని =
అని; ప్రణతుండు = నమస్కరించువాడు; ఐన =
అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; వర్ణనంబుల
= స్తోత్రముల; కున్ = కు; మెచ్చి
= మెచ్చుకొని; నిర్గుణుండు = రాగద్వేషాదులు లేనివాడు {రాగద్వేషాదులు
- 1రాగము 2ద్వేషము
3కామము 4క్రోధము
5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము
9ఈర్ష్య
10 అసూయ 11దంభము 12దర్పము
13 అహంకారము}; అయిన =
ఐన; హరి =
విష్ణువు; రోషంబున్ = కోపమును; విడిచి
= వదలివేసి; ఇట్లు = ఈ విధముగ; అనియె
= పలికెను.
సంతోషించితి = ముదమునందితిని; నీ =
నీ యొక్క; చరిత్రమున్ = నడవడిక; కున్ =
కు; సత్ =
మంచి; భద్రము = శుభములు; ఔగాక =
కలుగుగాక; నీ = నీ యొక్క; అంతర్
= మనసులోపల; వాంఛిత = కోరుచున్న; లాభము
= ప్రయోజనములు; ఎల్లన్ = అన్నిటిని; కరుణా
= కృప; ఆయత్తుండను = కలిగినవాడను; ఐ =
అయ్యి; ఇచ్ఛెదన్ = ఇచ్ఛెదను; చింతంజెందకు
= విచారపడకు; భక్త = భక్తుల యొక్క; కామదుడన్
= కోర్కెలతీర్చువాడను; నేన్ = నేను; సిద్ధంబు
= తప్పకజరుగునది; దుర్లోక్యుండన్ = చూడశక్యముగానివాడను; జంతు =
జీవ; శ్రేణి = కోటి; కిన్ =
కి; నన్నున్
= నన్ను; చూచినన్ = దర్శించినమాత్రమున; పునర్జన్మంబు
= మరలపుట్టుట; లేదు = ఉండదు; అర్భకా
= బాలుడ.
భావము:
నీ సేవ చేయని వాడు పరమ పదం చేరలేడు
కనుక, నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని
ప్రసాదించు” అని ప్రహ్లాదుడు వందన మాచరించాడు. ఆ సంస్తుతికి సంతోషించి, గుణరహితుడూ భగవంతుడూ నైన శ్రీనృసింహస్వామి
రోషం మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు.
“బాలకా! ప్రహ్లాదా! నిన్ను చూస్తే చాలా
ఆనందంగా ఉంది. నీ ప్రవర్తనకు చాలా సంతోషించాను. నీకు మిక్కలి శుభం కలుగుతుంది.
నేను భక్తుల కోరికలు తప్పక తీర్చే వాడిని. నీ మనసులో వాంఛించే వరాలను దయాహృదయుడనై
అనుగ్రహిస్తాను. ఏ దిగులూ పెట్టుకోకు. నేను చూడశక్యంకాని వాడినే. కాని ప్రాణి
కోటికి నన్ను ఒకసారి చూస్తే చాలు, పునర్జన్మ ఉండదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment