7-358-మత్త.
ఎండమావులవంటి
భద్రము లెల్ల
సార్థము లంచు మ
ర్త్యుండు రోగనిధాన
దేహముతో విరక్తుఁ
డుగాక యు
ద్దండ మన్మథవహ్ని నెప్పుడుఁ దప్తుఁడై
యొకనాఁడుఁ జే
రండు పారము
దుష్టసౌఖ్య పరంపరాక్రమణంబునన్.
టీకా:
ఎండమావుల = మృగతృష్ణలను {ఎండమావులు
- మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలువలె కనబడు నీడలు, భ్రాంతులు};
వంటి = పోలెడి; భద్రములు = సౌఖ్యములు; ఎల్లన్ = అన్నియును; సార్థములు = ప్రయోజనసహితములు;
అంచున్ = అనుచు; మర్త్యుడు = మరణించువాడు,
మనిషి; రోగ = జబ్బులకు; నిధానము
= స్థానమైన; దేహము = శరీరము; తోన్ =
తోటి; విరక్తుడు = విరాగముచెందినవాడు; కాక
= కాకుండగ; ఉద్దండ = తీవ్రమైన; మన్మథ =
కామమనెడి; వహ్నిన్ = అగ్నిచేత; ఎప్పుడున్
= ఎల్లప్పుడును; తప్తుండు = బాధపడెడివాడు; ఐ = అయ్యి; ఒకనాడున్ = ఒకనాటికిని; చేరండు = చేరలేడు; పారము = తీరమును; దుష్ట = చెడ్డవి యగు; సౌఖ్య = సౌఖ్యముల; పరంపరా = సమూహములందు; ఆక్రమణంబునన్ = గడపుటందు.
భావము:
ఎండమావుల వంటివి ఈ
సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన
దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు
ఈ దుష్టసౌఖ్య పరంపరలను దాటి ఎన్నటికీ తీరం చేరలేడు.
७-३५८-मत्त.
एंडमावुलवंटि भद्रमु लेल्ल सार्थमु लंचु म
र्त्युंडु रोगनिधान देहमुतो विरक्तुँडु गाक यु
द्दंड मन्मथवह्नि नेप्पुडुँ दप्तुँडै योकनाँडुँ जे
रंडु पारमु दुष्टसौख्य परंपराक्रमणंबुनन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment