7-348-వ.
ఇట్లు హరి కరస్పర్శనంబున భయ విరహితుండును, బ్రహ్మజ్ఞాన సహితుండును, బులకిత దేహుండును, సముత్పన్న సంతోషబాష్పసలిలధారా సమూహుండును, బ్రేమాతిశయ
గద్గద భాషణుండును, వినయ వివేక భూషణుండును, నేకాగ్ర చిత్తుండును, భక్తిపరాయత్తుండును నయి య
ద్దేవుని చరణ కమలంబులు దన హృదయంబున నిలిపికొని కరకమలంబులు ముకుళించి యిట్లని
వినుతించె.
టీకా:
ఇట్లు =
ఈ విధముగ; హరి = నరసింహుని; కర = చేయి; స్పర్శంబునన్
= తగులుటవలన; భయ = భయము; విరహితుండును
= పూర్తిగాలేనివాడును; బ్రహ్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానముతో;
సహితుండును = కూడినవాడును; పులకిత = గగుర్పాటు
చెందిన; దేహుండును = శరీరముగలవాడును; సముత్ఫన్న
= చక్కగాపుట్టిన; సంతోష = ఆనంద; బాష్పసలిల
= కన్నీటి; ధారా = ధారలతో; సమూహుండును
= కూడినవాడును; ప్రేమా = భక్తి యొక్క; అతిశయ
= అతిశయము చేత; గద్గద = డగ్గుతికపడిన; భాషుండును
= మాటలుగలవాడు; వినయ = వినయము; వివేక =
వివేకములచే; భూషణుండును = అలంకారముగగలవాడు; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండును = మనసుగలవాడు;
భక్తి = భక్తి; పర = ఎడల; ఆయత్తుండునున్ = సమైనవాడు; అయి = అయ్యి; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; చరణ = పాదములు యనెడి; కమలములున్ = పద్మములను;
తన = తన యొక్క; హృదయంబునన్ = హృదయములో;
నిలిపికొని = ఉంచుకొని; కర = చేతులు యనెడి;
కమలంబులున్ = పద్మములను; ముకుళించి = జోడించి;
ఇట్లు = ఈ విధముగ; అని = అని; వినుతించె = స్తుతించెను.
భావము:
నరసింహస్వామి చేతి స్పర్శతో ప్రహ్లాదునికి
భయంపోయింది; బ్రహ్మజ్ఞానం
కలిగింది, దేహం పులకరించింది; ఆనందభాష్పాలు
ధారలు కట్టాయి; ఆప్యాయతతో కంఠం గాద్గదికం అయింది; వినయవివేకాలు మరింత శోభ చేకూర్చాయి; చిత్తానికి
ఏకాగ్రత చిక్కింది; మనసు భక్తితో పరవశించిపోయింది; హృదయంలో హృషీకేశుడి పాదపద్మాలను నిలిపికొన్నాడు; చేతులు
జోడించి నరహరిని ఇలా స్తుతించాడు.
७-३४८-व.
इट्लु हरि करस्पर्शनंबुन भय विरहितुंडुनु, ब्रह्मज्ञान सहितुंडुनु, बुलकित देहुंडुनु, समुत्पन्न संतोषबाष्पसलिलधारा समूहुंडुनु, ब्रेमातिशय गद्गद भाषणुंडुनु, विनय विवेक भूषणुंडुनु, नेकाग्र चित्तुंडुनु, भक्तिपरायत्तुंडुनु नयि य द्देवुनि चरण
कमलंबुलु दन हृदयंबुन निलिपिकोनि करकमलंबुलु मुकुळिंचि यिट्लनि विनुतिंचे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment