Tuesday, April 5, 2016

దేవతల నరసింహ స్తుతి - ప్రళయార్కబింబంబు

7-342-సీ.
ప్రళయార్కబింబంబు గిది నున్నది గానినెమ్మోము పూర్ణేందు నిభము గాదు
శిఖిశిఖాసంఘంబు చెలువు చూపెడుఁ గాని; చూడ్కిఁ ప్రసాద భాసురము గాదు
వీరరౌద్రాద్భుతావేశ మొప్పెడుఁ గానిభూరి కృపారస స్ఫూర్తి గాదు
యద దంష్ట్రాకుర ప్రభలు గప్పెడుఁ గాని; రహసితాంబుజాతంబు గాదు;
7-342.1-తే.
ఠిన నఖర నృసింహ విగ్రహము గాని; కామినీజన సులభ విగ్రహము గాదు
విన్నదియుఁ గాదు; తొల్లి నే విష్ణువలన; న్నదియుఁ గాదు; భీషణాకార మనుచు.
టీకా:
ప్రళయా = ప్రళయకాలమందలి; అర్క = సూర్య; బింబంబు = బింబము; పగిదిన్ = వలె; ఉన్నది = ఉంది; కాని = తప్ప; నెఱ = నిండు; మోము = ముఖము; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని; నిభము = పోలినది; కాదు = కాదు; శిఖి = అగ్ని; శిఖా = మంటల; సంఘంబు = సమూహము; చెలువు = పోలికను; చూపెడున్ = చూపించుచున్నది; కాని = తప్పించి; చూడ్కిన్ = చూపు; ప్రసాద = అనుగ్రహముచే; భాసురము = ప్రకాశించునది; కాదు = కాదు; వీర = శౌర్యము; రౌద్రము = రౌద్రము; అద్భుత = ఆశ్చర్యము; ఆవేశమున్ = ఆవేశము; ఒప్పెడున్ = కనబడునది; కాని = కాని; భూరి = అత్యధికమైన; కృపా = కరుణా; రస = రసమును; స్పూర్తిన్ = కనబడునది; కాదు = కాదు; భయద = భయంకరమైన; దంష్ట్ర = కోరల; అంకుర = మొలకల యొక్క; ప్రభలున్ = కాంతులను; కప్పెడున్ = ప్రసరించునది; కాని = తప్పించి; దరహసిత = చిరునవ్వుతోకూడిన; అంబుజాతంబు = పద్మము {అంబుజాతము - అంబువు (నీరు)నందు జాతంబు (పుట్టునది), పద్మము}; కాదు = కాదు. 
కఠిన = గట్టి; నఖర = గోళ్ళు కలిగిన; నారసింహ = నరసింహుని; విగ్రహము = రూపము; కాని = తప్పించి; కామినీ = స్త్రీ {కామిని-కామమునందుఆసక్తిగలామె,స్త్రీ}; జన = జనములకు; సులభ = సుళువుగా లభించెడి; విగ్రహము = స్వరూపము; కాదు = కాదు; విన్నదియు = విన్నట్టిది; కాదు = కాదు; తొల్లి = ఇంతకు పూర్వము; నేన్ = నేను; విష్ణున్ = విష్ణుమూర్తి; వలన = వలన; కన్నదియున్ = చూచినది; కాదు = కాదు; భీషణ = భయంకరమైన; ఆకారము = రూపము; అనుచు = అనుచు.
భావము:
ఆ నరసింహావతారుని ముఖము ప్రళయకాలపు సూర్య బింబంలాగ ఉంది తప్పించి, ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలలు లాగా ఉన్నాయి తప్ప, అనుగ్రహంతో ప్రకాశిస్తూ లేవు. ఆ దేవుని రూపం వీర, రౌద్ర అద్భుత రసావేశాలతో నిండి ఉంది తప్ప, అపార దయారస స్పూర్తితో లేదు. ఆయన కోరలు దంతాలు భయంకరమైన ప్రకాశాలు వెలిగక్కుతున్నాయి తప్ప చిరునవ్వులు చిందించే పద్మకాంతులు ప్రసరించటం లేదు. గట్టి గోళ్ళతో కూడిన నరకేసరి విగ్రహం తప్పించి, సుందరీమణులను సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. శ్రీమహావిష్ణువు యొక్క ఈ భీకరతర ఆకారం ఎప్పుడూ నేను విన్నదీ కాదు, కన్నదీ కాదు.” అని ఆశ్చర్యపోయింది శ్రీ లక్ష్మీదేవి.
७-३४२-सी.
प्रळयार्कबिंबंबु पगिदि नुन्नदि गानि; नेम्मोमु पूर्णेंदु निभमु गादु;
शिखिशिखासंघंबु चेलुवु चूपेडुँ गानि; चूड्किँ प्रसाद भासुरमु गादु;
वीररौद्राद्भुतावेश मोप्पेडुँ गानि; भूरि कृपारस स्फूर्ति गादु;
भयद दंष्ट्राकुर प्रभलु गप्पेडुँ गानि; दरहसितांबुजातंबु गादु;
७-३४२.१-त.
कठिन नखर नृसिंह विग्रहमु गानि; कामिनीजन सुलभ विग्रहमु गादु;
विन्नदियुँ गादु; तोल्लि ने विष्णुवलन; गन्नदियुँ गादु; भीषणाकार मनुचु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: