7-361-క.
ఘోటకవదనుఁడ
వై మధు
కైటభులం
ద్రుంచి నిగమగణముల నెల్లం
బాటించి
యజున కిచ్చిన
కూటస్థుఁడ
వీశ్వరుఁడవు కోవిదవంద్యా!
7-362-వ.
ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను
మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం
బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.
టీకా:
ఘోటకవదనుడవు = హయగ్రీవావతారుడవు {ఘోటకవదనుడు - గుర్రపుముఖముగలవాడు, హయగ్రీవుడు,
విష్ణువు}; ఐ = అయ్యి;
మధు = మధుడు; కైటభుల్ = కైటభులను; త్రుంచి = చంపి; నిగమ = వేదములు; గణములన్ = సమూహములను; ఎల్లన్ = అన్నిటిని; పాటించి = ఉద్ధరించి; యజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చినట్టి; కూటస్థుడవు = అక్షరుడవు {కూటస్థుడు -
సర్వకాలసర్వాస్థలయందు వికారమునొందక ఒక్కతీరున శాశ్వతుడుగానుండువాడు, విష్ణువు}; ఈశ్వరుడవు = ప్రభువవు; కోవిదవంద్యా = నరసింహా {కోవిదవంద్యుడు - కోవిదుల
(పండితుల)చే వంద్య (నమస్కరింపబడువాడు), విష్ణువు}.
ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కృత
= కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపరంబులన్
= ద్వాపరయుగములను; మూడు = మూడు(3); యుగంబులు
= యుగములు; అందును = లోను; తిర్యక్ = జంతువుల,
వరాహాది; మానవ = మనుష్యల, రామ కృష్ణాది; ముని = మునుల, నారద
వ్యాసాది; జలచర = మత్య కూర్మ; ఆకారంబులన్
= రూపములలో; అవతరించి = అవతరించి; లోకంబులన్
= లోకములను; ఉద్ధరించుచు = కాపాడుచు; ధరించుచు
= పాలించుచు; హరించుచు = నశింపజేయుచు; యుగ
= ఆయా యుగములకు; అనుకూల = అనుకూలమైన; ధర్మంబులన్
= ధర్మములను; ప్రతిష్టించుచున్ = పాదుకొలుపుచు; ఉందువు = ఉందువు; దేవా = నరసింహా; అవధరింపుము = వినుము.
భావము:
ఓ పరమేశ్వరా! నరసింహా!
నీవు పండితులచే వంద్యమానుడవు. ఆ సమయంలో హయగ్రీవావతారుడవై వచ్చి మధుకైటభ రాక్షసులను
సంహరించావు. వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అటువంటి కూటస్థుడవైన
భగవానుడవు నీవు,
ఇలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అను మూడు యుగాలలోనూ జంతు, మానవ, ఋషి,
జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, హరిస్తూ ఉంటావు; ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను
ప్రతిష్టించి పరిపాలిస్తుంటావు. ఓ నరకేసరి దేవా! ఇంకా విను
७-३६१-क.
घोटकवदनुँड वै मधु
कैटभुलं द्रुंचि निगमगणमुल नेल्लं
बाटिंचि यजुन किच्चिन
कूटस्थुँड वीश्वरुँडवु कोविदवंद्या!
७-३६२-व.
इव्विधंबुन गृत त्रेता द्वापरंबुलनु मूँडु युगंबु लंदुनु
दिर्यङ्मानव मुनि जलचराकारंबुल नवतरिंचि लोकंबुल नुद्धरिंचुचु, धरिंचुचु, हरिंचुचु युगानुकूल धर्मंबुलं ब्रतिष्ठिंचुचु नुंडुदुवु; देवा! यवधरिंपुमु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
7 comments:
Ho Come Prahlada mentioning about trethaa, Dwaapara & Kali Yugas? I could not get the logic behind that. Do We construe its Pothana's bhakthi rather than penning about the Bhakthi of PRahlada?
నమస్కారం విజె గారు,
మీ అమూల్య స్పందనకు అనేక ధన్యవాదాలు. చాలా బాగా విశ్లేషించారు అభినందనలండి.
తమ ప్రశ్న ప్రహ్లాదునికి యుగాల పేర్లు ఎలా తెలిశాయి అని సరదాగా తీసుకుందా మండి. పాపం అతను ఆంగ్ల విద్యార్థి కాదు కదా, చండామార్కుల వారేమో బాలశిక్షతో మొదలుపెట్టే ఉంటారు. ఇతను చదివేసే ఉంటాడు. పైగా తర్కంతో సహా సకల చదువల మర్మములు చదివేసాడట. ఆఖరికి గృహస్థాశ్రమంలో అవసరపడే శాస్త్రాలు కూడా చదివేసాడట. పైగా ఇవన్నీ ఏ తగులమూ లేకుండా, గురువులు చెప్పింది చెప్పినట్లు, ఏమాత్రం ప్రశ్నించకుండా చదివేశాడట. ఇదంతా వర్ణించిన వారేమో తెలుగుల పుణ్యపేటి సహజకవి పోతనామాత్యుల వారు.
యుగాలు కూడా; రోజులో రాత్రి పగలు, వారంలో 7 రోజులు, మాసంలో తిథులు . . లాగా ప్రతి మన్వంతరం మున్నగు కాల మానములలో తిరుగుతూ ఉంటాయి అని మన శాస్త్రాలు నిర్ణయించాయి. అది మరచిపోకండి అని విజె గారు గుర్తు చేస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్రలో ఎన్ని రకాల మానాలు మారాయో చెప్పలేం కాని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మన కాలమానం మన జాలగూడులో కొంత వివరించాము వాటిని లింకు కాలము - కొలత లో బాగా క్రిందివరకూ వెళ్ళి చూడగలరు.
జై శ్రీకృష్ణ
ధన్యవాదాలండి. నా పొరపాటు సరిదిద్దుకున్నాను. నమస్కారం.
రావు గారు, నా ప్రశ్న ని సరిగ్గా వ్యక్తపరచలేక పోయనందుకు క్షమాపణలు .. ప్రహ్లాదుని కాలానికి ఇంకా త్రేతా యుగమ, ద్వాపర యుగము ఉంటాయని ఎలా ప్రస్తావించ బడిందో అన్న సందేహం అంతే.. ఆ యుగాలు ఉంటాయని ముందుగానే తెలుపబడిందా ఏమిటో యన్న విషయం ఏమైనా చెబ్తారేమోననుకుని అడిగానండి.... అతి తెలివి ప్రదర్సన అనుకుని పొరబడ్డారు.. నేను ఈ మధ్యనే పురాణాలు చదవడం మొదలు పెట్టా ముఖ్యంగా పద్యాలు
రావు గారు, BTW, మీరు నా ప్రశ్నని సరిగ్గా గ్రహించ లేక పోయినా.. మీ వెటకారాన్ని, వెక్కిరింతని మాత్రం సరిగ్గా గ్రహించాననండోయ్ :)
మీ వ్యాసం లాగానే మీ హాస్య చతురత కూడా బహు బాగుంది..
విజె గారు నమస్కారం అండి
ముందుగా మీ ప్రశ్న సరిగా ్ర్థం చేసుకేలేకపోయినందుకు మన్నించండి.
ఇందులో ఏవిధమైన వెటకారం కానీ, వెక్కిరింత గానీ లేవండి. అతి తెలివి చూపటం అని కూడా అనుకోలేదండి. నా సమాధానాలలో పొరపాటున అట్టివి స్పురించి ఉంటే దయచేసి మన్నించండి. నేను తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, భావం వ్రాయటంలో అసంపూర్ణతలను సున్నితంగా చూపుతున్నారు అనుకున్నాను. మీ పలుకులలో సంస్కారం, వినయం కనబడుతున్నాయి నాకైతే. తప్పులు చూపి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేవారు నా దృష్టిలో ధన్యులు. ఈ సాయంచేసే వారి మేలుకి సర్వధా కృతజ్ఞుడను. మీ స్పందన వలన నా పొరపాటు దిద్దుకోగలిగాను. అందుకు మీకు మరల ధన్యవాదాలు. ఇకపోతే, దయచేసి మన జాలగూడు (వెబ్ సైట్) తెలుగుభాగవతం.ఆర్గ్ లోకి వెళ్ళి వివరణలు అన్న విభాగం తెరచి, అనుయుక్తాలు తెరచి, కాలము - కొలత శీర్షిక తెరచి చూడండి బాగా క్రిందకి వెళితే యుగాలు, మన్వంతరాలు ఉంటాయి. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అలాగే గ్రంధము విభాగంలో, సప్తమ స్కంధములో, ప్రహ్లాదుడు స్తుతించుటలో, 7-362-వ. పద్యం వద్ద ఉపకరణాలు ప్రక్కన ఉన్న టీక, భావము పెట్టెలలో టిక్ పెట్టి చూడండి.
కాలము-కొలత; యుగాలు- మన్వంతరాలు
Post a Comment