Tuesday, April 19, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – జనులు దిక్పాలుర


7-357-సీ.
నులు దిక్పాలుర సంపదాయుర్విభములు గోరుదురు భవ్యంబు లనుచు
వి యంతయును రోషహాసజృంభితమైన; మాతండ్రి బొమముడి హిమఁ జేసి
విహతంబులగు; నట్టి వీరుండు నీ చేతనిమిషమాత్రంబున నేఁడు మడిసె
కావున ధ్రువములు గావు బ్రహ్మాదులశ్రీవిభవంబులు జీవితములుఁ;
7-357.1-తే.
గాలరూపకుఁ డగు నురుక్రమునిచేత; విదళితములగు; నిలువవువేయు నేల?
యితర మే నొల్ల నీ మీఁది యెఱుక గొంత; లిగియున్నది గొలుతుఁ గింరుఁడ నగుచు.
టీకా:
          జనులు = మానవులు; దిక్పాలురన్ = దిక్పాలకాదులను {దిక్పాలకులు - 1ఇంద్రుడు (తూర్పునకు) 2అగ్ని (ఆగ్నేయము) 3యముడు (దక్షిణము) 4నిరృతి (నైరుతి) 5వరుణుడు (పడమర) 6వాయువు (వాయవ్యము) 7కుబేరుడు (ఉత్తరమునకు) 8ఈశానుడు (ఈశాన్యములకు) పాలకులు}; సంపద = సంపదలు, కలిమి; ఆయుర్ = జీవితకాలము; విభవములున్ = వైభవములను, ఇవి సౌఖ్యములవంటివి; కోరుదురు = కోరుచుందురు; భవ్యంబులు = గొప్పవి; అనుచున్ = అనుచు; అవి = అవి; అంతయున్ = అన్నియును; రోష = రోషపూరిత; హాస = నవ్వుచేత; విజృంభితము = చెలరేగినది; ఐన = అయిన; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; బొమముడి = ముఖముచిట్లించినమాత్ర; మహిమన్ = ప్రభావము; చేసి = వలన; విహతంబులు = నష్టములు; అగున్ = అగును; అట్టి = అటువంటి; వీరుండు = శూరుడు; నీ = నీ; చేతన్ = వలన; నిమిష = రెప్పపాటుకాలము; మాత్రంబునన్ = మాత్రములోనే; నేడు = ఈ దినమున; మడిసె = మరణించెను; కావునన్ = అందుచేత; ధ్రువములు = నిత్యములు; కావు = కావు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల = మొదలగువారి; శ్రీ = సిరి; విభవంబులు = వైభవములు; జీవితములున్ = బతుకులు; కాల = కాలము; రూపకుడు = స్వరూపమైనవాడు; అగు = అయిన; ఉరుక్రముని = విష్ణుమూర్తి {ఉరుక్రముడు - ఉరు (గొప్ప) క్రముడు (పరాక్రమముగలవాడు), విష్ణువు}; చేత = వలన. 
          విదళితములు = చీల్చబడినవి; అగున్ = అగును; నిలువవు = నిలబడవు; వేయున్ = అనేకమాటలు; ఏలన్ = ఎందుకు; ఇతరమున్ = మిగిలినవి ఏవియును; ఏన్ = నేను; ఒల్లన్ = ఒప్పుకొనను; నీ = నీ; మీది = అందలి; ఎఱుక = వివేకము; కొంత = కొంచము; కలిగియున్నది = కలదు; కొలతున్ = కొలచెదను; కింకరుండను = సేవకుడను; అగుచు = అగుచు.
భావము:
            ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్పాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి.కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.
७-३५७-सी.
जनुलु दिक्पालुर संपदायुर्विभ; वमुलु गोरुदुरु भव्यंबु लनुचु;
नवि यंतयुनु रोषहासजृंभितमैन; मातंड्रि बोममुडि महिमँ जेसि
विहतंबुलगु; नट्टि वीरुंडु नी चेत; निमिषमात्रंबुन नेँडु मडिसे;
कावुन ध्रुवमुलु गावु ब्रह्मादुल; श्रीविभवंबुलु जीवितमुलुँ;
७-३५७.१-ते.
गालरूपकुँ डगु नुरुक्रमुनिचेत; विदळितमुलगु; निलुववु; वेयु नेल?
यितर मे नोल्ल नी मीँदि येर्रुक गोंत; गलिगियुन्नदि गोलुतुँ गिंकरुँड नगुचु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: