Monday, April 4, 2016

దేవతల నరసింహ స్తుతి – హరికిం బట్టపుదేవివి

7-340-క.
రికిం బట్టపుదేవివి
రిసేవానిపుణమతివి రిగతివి సదా
రిరతివి నీవు చని నర
రిరోషము డింపవమ్మ! రివరమధ్యా!
7-341-వ.
అనిన నియ్యకొని మహోత్కంఠతోడ నా కలకంఠకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుం జని.
టీకా:
          హరి = విష్ణుని; కిన్ = కి; పట్టపుదేవివి = ధర్మపత్నివి; హరి = విష్ణుని; సేవా = సేవించుట యందు; నిపుణమతివి = నేర్పుగలదానవు; హరి = విష్ణువే; గతివి = దిక్కుగాగలదానవు; సదా = ఎల్లప్పుడును; హరి = విష్ణుని యెడల; రతివి = ప్రీతిగలదానివి; నీవు = నీవు; చని = వెళ్ళి; నరహరి = నరసింహుని; రోషమున్ = కోపమును; డింపవు = తగ్గింపుము; అమ్మ = తల్లి; హరి = సింహమువలె; వర = చక్కటి; మధ్య = నడుముగలామె.
            అనినన్ = అనగా; ఇయ్యకొని = అంగీకరించి; మహా = గొప్ప; ఉత్కంఠ = కౌతుకము; తోడన్ = తోటి; ఆ = ఆ; కలకంఠ = అవ్యక్తమధురధ్వనిగల; కంఠి = కంఠముగలామె; నరకంఠీరవుని = నరసింహుని; ఉపకంఠంబున్ = సమీపమున; కున్ = కు; చని = వెళ్ళి.
భావము:
            “ఓ లక్ష్మీదేవీ! నువ్వు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పట్టపురాణివి. ఆ శేషసాయికి సేవచేయుటలో మిక్కిలి నేర్పరివి. నారాయణుడే అండగా పొందిన నీవు, నిత్యం శ్రీహరి యెడల ప్రీతితో మెలుగుతుంటావు. సింహం వలె చిక్కని సన్నని నడుము గల చక్కని తల్లీ! నీవల్లే అవుతుంది, నరసింహుని శాంతపరచు.”
            దేవతలు ఇలా అభ్యర్థించగా సమ్మతించి, మధురంగా మాట్లాడే మాత ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో ఆ ఉగ్ర నరకేసరి సన్నిధికి వెళ్ళి చూసింది.
७-३४०-क.
हरिकिं बट्टपुदेविवि
हरिसेवानिपुणमतिवि हरिगतिवि सदा
हरिरतिवि नीवु चनि नर
हरिरोषमु डिंपवम्म! हरिवरमध्या!
७-३४१-व.
अनिन निय्यकोनि महोत्कंठतोड ना कलकंठकंठि नरकंठीरवुनि युपकंठंबुनकुं जनि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: