Tuesday, December 8, 2015

ప్రహ్లాద చరిత్ర - అచ్చపుజీకటింబడి

hiranyakasiap-prahlad.jpg
7-180-వచనము
అనినఁ దండ్రికిఁ బ్రహ్లాదుం డిట్లనియె.
7-181-ఉత్పలమాల
చ్చపుఁ జీకటింబడి గృవ్రతులై విషయప్రవిష్టులై
చ్చుచుఁ బుట్టుచున్ మరలఁ ర్వితచర్వణు లైనవారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చి నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.
            ఇలా కోపంగా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి, దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు, కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ, పుడుతూ, మరల చస్తూ, పుడుతూ ఇలా ఈ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకళ్ళు బోధించినా కలగదు; ఏమి ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు; ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు; అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి.
७-१८०-वचनमु
अनिनँ दंड्रिकिँ ब्रह्लादुं डिट्लनिये.
७-१८१-उत्पलमाल
अच्चपुँ जीकटिंबडि गृहव्रतुलै विषयप्रविष्टुलै
चच्चुचुँ बुट्टुचुन् मरलँ जर्वितचर्वणु लैनवारिकिं
जेच्चरँ बुट्टुने परुलु चेप्पिन नैन निजेच्छ नैन ने
मिच्चिन नैनँ गानलकु नेँगिन नैन हरिप्रबोधमुल्.
            అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
          అచ్చపుజీకటిన్ = గాఢాంధకారమునందు; పడి = పడిపోయి; గృహవ్రతులు = గృహస్తులు; ఐన = అయినట్టి; విషయ = ఇంద్రియార్థములలో; ప్రవిష్టులు = లోలురు; = అయ్యి; చచ్చుచున్ = చనిపోతూ; పుట్టుచున్ = పుడుతూ; మరల = మరల; చర్వితచర్వణులు = తిరిగిచేయువారు {చర్వితచర్వణము - తిన్నదే మరల తినుట}; ఐన = అయిన; వారి = వారి; కిన్ = కి; చెచ్చెఱన్ = శ్రీఘ్రమే; పుట్టునే = కలుగునా ఏమి, కలుగదు; పరులు = ఇతరులు; చెప్పినన్ = చెప్పిన; ఐనన్ = ఐనప్పటికి; నిజేచ్ఛన్ = తనంతటతను; ఐనన్ = అయినను; ఏమి = ఏది; ఇచ్చినన్ = ఇచ్చిన; ఐనన్ = అయినను; కానల = అడవుల; కున్ = కి; ఏగినన్ = వెళ్ళిన; ఐనన్ = అప్పటికిని; హరి = నారాయణుని; ప్రభోదముల్ = జ్ఞానములు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: