Thursday, December 24, 2015

ప్రహ్లాదుని హింసించుట - - ఎఱుఁగఁడు


7-202-చ.
ఱుఁగఁడు జీవనౌషదములెవ్వరు భర్తలు లేరు; బాధలం
లఁడు నైజ తేజమునఁథ్యము జాడ్యము లేదు; మిక్కిలిన్
మెయుచు నున్నవాఁ; డొక నిమేషము దైన్యము నొందఁ డింక నే
తెఱఁగునఁ ద్రుంతు? వేసరితిదివ్యము వీని ప్రభావ మెట్టిదో?
టీకా:
          ఎఱుగడు = తెలిసినవాడుకాడు; జీవన = మరణించకుండెడి; ఔషదములు = మందులను; ఎవ్వరున్ = ఎవరుకూడ; భర్తలు = రక్షించువారు; లేరు = లేరు; బాధలన్ = కష్టములకు; తఱలడు = చలించడు; నైజ = స్వాభావిక; తేజమునన్ = తేజస్సుతో; తథ్యము = నిశ్చయముగా; జాడ్యము = జడ్డుదనము; లేదు = లేదు; మిక్కిలిన్ = పెద్దగ; మెఱయుచున్ = ప్రకాశించుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఒక = ఒక; నిమేషమున్ = కొద్దిసమయమైనా; దైన్యమున్ = దీనతను; ఒందడు = పొందడు; ఇంకన్ = ఇంకా; ఏ = ఎలాంటి; తెఱగునన్ = విధానములను; త్రుంతున్ = చంపగలను; వేసరితిన్ = విసిగిపోతిని; దివ్యము = చాలాగొప్పది; వీని = ఇతని; ప్రభావము = మహిమ; ఎట్టిదో = ఎలాంటిదో కదా.
భావము:
            అమృతం ఏమైనా తాగాడు అనుకుందా మంటే, అలాంటివి వీడికి తెలియదు కదా. పోనీ ఎవరైనా కాపాడుతున్నారా, అంటే అలాంటి వారు ఎవరూ లేరు. నిశ్చయంగా స్వభావసిద్ధంగానే జాడ్యాలు అంటవేమో? బాధలు పెట్టే కొద్దీ దేహ కాంతి తగ్గటం లేదు. ఏ నిమిషం దీనత్వం పొందడు. ఇంక ఈ ప్రహ్లాదుడిని ఎలా చంపాలి. ఎలాగో తెలియక విసుగొస్తోంది. ఇంతటి వీడి శక్తి చూస్తే, ఇదేదో దేవతా ప్రభావంలా అనిపిస్తోంది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: