7-185-శార్దూల విక్రీడితము
క్రోడంబై పినతండ్రిఁ జంపె నని తాఁ గ్రోధించి చిత్తంబులో
వీడం జేయఁడు బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుఁడై
యోడం డక్కట! ప్రాణవాయువులు వీఁ డొప్పించుచున్నాఁడు నా
తోడన్ వైరముపట్టె నిట్టి జనకద్రోహిన్ మహిం గంటిరే.
7-186-వచనము
అని రాక్షసుల నీక్షించి యిట్లనియె.
“విష్ణువు మాయా వరాహ
రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపేశాడని బాధ లేకుండా, సిగ్గు లేని వీడు
మన వంశ విరోధికి బంటు లాగ భజన చేస్తాడా!
పైగా నా తోటే విరోధానికి సిద్ధపడతాడా! అమ్మో! వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడే! ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టే కొడుకును లోకంలో ఎక్కడైనా
చూసారా?” అలా అని హిరణ్యకశిపుడు
వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు.
७-१८५-शार्दूल
विक्रीडितमु
क्रोडंबै
पिनतंड्रिँ जंपे ननि ताँ ग्रोधिंचि चित्तंबुलो
वीडं जेयँडु
बंटुभंगि हरिकिन् विद्वेषिकिन् भक्तुँडै
योडं डक्कट!
प्राणवायुवुलु वीँ डोप्पिंचुचुन्नाँडु ना
तोडन्
वैरमुपट्टे निट्टि जनकद्रोहिन् महिं गंटिरे.
७-१८६-वचनमु
अनि राक्षसुल
नीक्षिंचि यिट्लनिये.
క్రోడంబు = వరహావతారుడు; ఐ = అయ్యి; పినతండ్రిన్ = చిన్నాన్నను; చంపెను = చంపేసెను; అని = అని; తాన్ = తను; క్రోధించి = కోపముపెంచుకొని; చిత్తంబు = మనసు; లోన్ = లోనుండి; వీడన్ = దూరము; చేయడు = చేయడు; బంటు = సేవకుని; భంగిన్ = వలె; హరి = నారాయణుని; కిన్ = కి; విద్వేషి = విరోధి; కిన్ = కి; భక్తుడు = భక్తుడు; ఐ = అయ్యి; ఓడండు = సిగ్గుపడడు; అక్కట = అయ్యో; ప్రాణవాయువులు = ప్రాణవాయువులకు; వీడు = ఇతడు; ఒప్పించుచున్నాడు = నొప్పికలుగజేయుచున్నాడు; నా = నా; తోడన్ = తోటి; వైరము = పగ; పట్టెన్ = పట్టెను; ఇట్టి = ఇలాంటి; జనక = తండ్రికి; ద్రోహిన్ = ద్రోహముచేయువానిని; మహిన్ = నేలపైన; కంటిరే = ఎక్కడైనా చూసేరా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment