7-195-వ.
ఇట్లు సర్వాత్మకంబై
యిట్టిదట్టి దని నిర్దేశింప రాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణుని యందుఁ జిత్తంబుజేర్చి తన్మయుం డయి పరమానందంబునం బొంది
యున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు దన
కింకరులచేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబు లైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం
జూచి.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; సర్వాత్మకంబు = అఖిలముతానేయైనది; ఐ = అయ్యి; ఇట్టిదట్టిది = ఇలాంటిది అలాంటిది; అని = అని; నిర్దేశింపరాని = చెప్పలేనట్టి; పరబ్రహ్మంబు = పరబ్రహ్మము; తాన = తానే; ఐ = అయ్యి; ఆ = ఆ; మహా = గొప్ప; విష్ణుని = నారాయణుని {విష్ణువు - (విశ్వమంతట)
వ్యాపించినవాడు, హరి}; అందున్ = అందు; చిత్తంబు = మనస్సును; చేర్చి = లగ్నముచేసి; తన్మయుండు = మయమరచినవాడు; అయి = అయ్యి; పరమ = అత్యధికమైన, సర్వాతీతమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; అందున్ = ఎడల; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన; కింకరుల = సేవకుల; చేతన్ = చేత; చేయించుచున్న = చేయిస్తున్నట్టి; మారణ = చంపెడి; కర్మంబులు = కార్యములు, పనులు; పాప = పాపపు; కర్ముని = పనులుచేయువారి; అందున్ = ఎడల; ప్రయుక్తంబులు = ప్రయోగింపబడినవి; ఐన = అయిన; సత్కారంబులున్ = ఉపకారములను; పోలెన్ = వలె; విఫలంబులు = వ్యర్థములు; అగుటన్ = అగుట; చూచి = చూసి.
భావము:
ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణించలేని ఆ సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మము తానే అయ్యాడు.
తన మనస్సును మహావిష్ణువు
మీద నిలిపి తనను తానే మరచి తాదాత్మ్యం చెంది ఆనందంతో పరవశించి పోతున్నాడు. పాపాత్ముడి పట్ల చేసిన సన్మానాలు ఎలా వ్యర్థం అవుతాయో, అలా హిరణ్యకశిపుడు తన
భటులచేత పెట్టిస్తున్న బాధలు అన్నీ విఫలం అయిపోతున్నాయి. ఇది చూసి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు.
७-१९५-व.
इट्लु सर्वात्मकंबै
यिट्टिदट्टि दनि निर्देशिंप रानि परब्रह्मंबु दानयै य म्महाविष्णुनि यंदुँ
जित्तंबुजेर्चि तन्मयुं डयि परमानंदंबुनं बोंदि युन्न प्रह्लादुनि यंदु
राक्षसेंद्रुंडु दन किंकरुलचेतं जेयिंचुचुन्न मारणकर्मंबुलु पापकर्मुनि यंदुँ
ब्रयुक्तंबु लैन सत्कारंबुलुं बोले विफलंबु लगुटं जूचि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment