Monday, December 14, 2015

ప్రహ్లాదుని హింసించుట - హంతవ్యుడు

7-189-క.
హంవ్యుఁడు రక్షింపను
మంవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంవ్యుఁడు వధమున కుప
రంవ్యుం డనక చంపి రం డీ పడుచున్."
7-190-వ.
అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడికోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు దెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుం బోలె దామ్ర సంకాశంబు లయిన కేశంబులు మెఱయ ఖేదన చ్ఛేదన వాదంబులు జేయుచు.
టీకా:
          హంతవ్యుడు = చంపదగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింపదగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మానదగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడచున్ = పిల్లవానిని.
          అని = అని; దానవేంద్రుండు = రాక్షసరాజు; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; వాడి = పదునైన; కోఱలు = కోరలు; కల = కలిగిన; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకులు; శూల = శూలమును; హస్తులు = చేతులోధరించినవారు; ఐ = అయ్యి; వక్త్రంబులు = నోళ్ళు; తెఱచికొని = తెరుచుకొని; ఉబ్బి = పొంగిపోతూ; బొబ్బలు = అరుపులు; ఇడుచున్ = పెడుతూ; ధూమ = పొగతో; సహిత = కూడిన; దావదహనంబునన్ = కారుచిచ్చును; పోలెన్ = వలె; తామ్ర = రాగితో; సంకాశంబులు = పొల్చదగినట్టి; కేశంబులున్ = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగా; ఖేదన = కొట్టండి అనెడి; ఛేదన = నరకండి అనెడి; వాదంబులున్ = అరుపులు; చేయుచున్ = పెడుతూ.
భావము:
            ఇతడు చంపదగినవాడు. ఏ మాత్రం క్షమించదగినవాడు కాడు. ప్రహ్లాదుడు తక్షణం యమపురికి పంపదగినవాడు. తప్పులు మన్నించకండి. జాలి పడి విడిచిపెట్టకుండా వధించి రండి.”
            అని ప్రహ్లాదుడిని చంపమని దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు. అంతట పదునైన కోరలు కలిగిన చాలామంది రాక్షసులు చేతులలో శూలాలు పట్టుకుని, భయంకరంగా నోళ్లు తెరచి అరుస్తూ ఉద్రేకంగా గంతులు వేయసాగారు. విరబోసుకున్న ఎర్రటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటలు లాగా ఉన్నారు. అలాంటి భీకర ఆకారాలు గల ఆ రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిడుతూ, కొడుతూ, మాటలతో ఆయుధాలతో బాధించటం మొదలెట్టారు.

७-१८९-क. 
हंतव्युँडु रक्षिंपनु
मंतव्युँडु गाडु यमुनि मंदिरमुनकुन्
गंतव्युँडु वधमुन कुप
रंतव्युं डनक चंपि रं डी पडुचुन्."
७-१९०-व. 

अनि दानवेंद्रुं डानतिच्चिन वाँडिकोर्रलु गल रक्कसुलु पेक्कंड्रु शूलहस्तुलै वक्त्रंबुलु देर्रचिकोनि युब्बि बोब्बलिडुचु धूमसहित दावदहनंबुनुं बोले दाम्र संकाशंबु लयिन केशंबुलु मेर्रय खेदन च्छेदन वादंबुलु जेयुचु.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=6&Padyam=189.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: