7-191-ఉ.
"బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య
సం
శీలుఁడు వీఁ డవధ్యుఁ" డని చిక్కక స్రుక్కక క్రూరచిత్తులై
శూలములం దదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్ర వా
చాలత నందఱున్ దివిజశత్రుఁడు వల్దనఁ డయ్యె భూవరా!
టీకా:
బాలుడు = చిన్నపిల్లవాడు; రాచబిడ్డడు = రాకుమారుడు; కృపాళుడు = దయగలవాడు; సాధుడు = మెత్తనిస్వభావముగలవాడు; లోక = లోకులచే; మాన్య = మన్నింపదగిన; శీలుడు = వర్తనగలవాడు; వీడు = ఇతడు; అవధ్యుడు = చందగినవాడుకాడు; అని = అని; చిక్కక = వెరవక; స్రుక్కక = భయపడక; క్రూర = భయంకరమైన; చిత్తులు = మనసుగలవారు; ఐ = అయ్యి; శూలములన్ = శూలములతో; తత్ = అతని; అంగములన్ = అవయవములను; సుస్థిరులు = బాగానిలకడగలవారు; ఐ = అయ్యి; ప్రహరించిరి = కొట్టిరి; ఉగ్ర = భీకరమైన; వాచాలతన్ = వాగుడుతో; అందఱున్ = అందరును; దివిజశత్రుడు = రాక్షసుడు; వల్దు = వద్దు; అనడు = అనకుండెడివాడు; అయ్యెన్ = అయ్యెను; భూవరా = రాజా.
భావము:
ఓ ధర్మరాజా! అంతట ఆ దానవులు “అయ్యో! ఇతగాడు బాగా చిన్న పిల్లాడు, బహు సుకుమారుడు, మీదుమిక్కిలి తమ
రాకుమారుడు” అని కాని; “దయ గల వాడు, మంచి వాడు, అందరూ మెచ్చుకునే గుణం శీలం కలవాడు” అని కాని ఏమాత్రం జాలికూడా లేకుండా
ప్రహ్లాదుడిని బాగా కొట్టారు. శూలాలతో
క్రూరంగా పొడిచారు. గట్టిగా నానా మాటలు అన్నారు, తిట్టారు. నానా బాధలూ పెట్టారు ఇంత ఎదురుగా జరుగుతుంటే కన్నతండ్రి, కొడుకును కొట్టవద్దు అనటం లేదు, పైగా వినోదంగా చూస్తున్నాడు. సొంత కొడుకుమీద మరీ అంత పగ ఏమిటో.
७-१९१-उ.
"बालुँडु राचबिड्डँडु कृपाळुँडु साधुँडु लोकमान्य सं
शीलुँडु वीँ डवध्युँ" डनि चिक्कक स्रुक्कक क्रूरचित्तुलै
शूलमुलं ददंगमुल सुस्थिरुलै प्रहरिंचि रुग्र वा
चालत नंदर्रुन् दिविजशत्रुँडु वल्दनँ डय्ये भूवरा!
७-१९१-उ.
"बालुँडु राचबिड्डँडु कृपाळुँडु साधुँडु लोकमान्य सं
शीलुँडु वीँ डवध्युँ" डनि चिक्कक स्रुक्कक क्रूरचित्तुलै
शूलमुलं ददंगमुल सुस्थिरुलै प्रहरिंचि रुग्र वा
चालत नंदर्रुन् दिविजशत्रुँडु वल्दनँ डय्ये भूवरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment