7-192-చ.
పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రము
న్నొలియదు లోపలన్ రుధిర ముబ్బదు కందదు శల్య సంఘమున్
నలియదు దృష్టివైభవము నష్టము గాదు ముఖేందు కాంతియుం
బొలియదు నూతనశ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్.
టీకా:
పలువురు = అనేకులు; దానవుల్ = రాక్షసులు; పొడువన్ = పొడవగా; బాలుని = పిల్లవాని; దేహము = శరీరము; లేశ = కొంచపు; మాత్రమున్ = మాత్రమైనను; ఒలియదు = ఒరసికొనిపోదు, చిట్లదు; లోపలన్ = లోపలనుంచి; రుధిరము = రక్తము; ఉబ్బదు = పొంగదు; కందదు = కందిపోదు; శల్య = ఎముకల; సంఘమున్ = గూడు; నలియదు = నలిగిపోదు; దృష్టి = చూపులలోని; వైభవము = మెరుపు; నష్టముగాదు = తగ్గిపోదు; ముఖ = మోము యనెడి; ఇందు = చంద్రుని; కాంతియున్ = ప్రకాశము; పొలియదు = నశింపదు; నూతన = కొత్తగ; శ్రమము = అలసట; పుట్టదు = కలగదు; పట్టదు = చెందదు; దీనభావమున్ = భీరుత్వమును.
భావము:
అదేం విచిత్రమూ కాని, అంతమంది పెద్ద-పెద్ద
రాక్షసులు ఇలా ఆ ఒక్క బాలుడిమీద పడి శక్తి మీర పొడుస్తుంటే, ప్రహ్లాదుడి శరీరం అసలు
ఏమాత్రం కందనే కంద లేదు. రక్తం చిందలేదు, లోపలి ఎముకలు విరగలేదు, కళ్ళ లోని కళ మాయ లేదు, ముఖం వాడలేదు, కనీసం అతనిలో ఎక్కడా అలసట కూడా కనిపించ లేదు.
७-१९२-च.
पलुवुरु दानवुल् पोडुव बालुनि देहमु लेशमात्रमु
न्नोलियदु लोपलन् रुधिर मुब्बदु कंददु शल्य संघमुन्
नलियदु दृष्टिवैभवमु नष्टमु गादु मुखेंदु कांतियुं
बोलियदु नूतनश्रममु पुट्टदु पट्टदु दीनभावमुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment