7-207-శా.
వక్రుండైన జనుండు వృద్ధ
గురు సేవంజేసి మేధానయో
పక్రాంతిన్ విలసిల్లు
మీఁదట వయఃపాకంబుతో బాలకున్
శక్రద్వేషణబుద్ధుఁ
జేయుము మదిం జాలింపు మీ రోషమున్
శుక్రాచార్యులు వచ్చునంత
కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్."
టీకా:
వక్రుండు = వంకరబుద్ధిగలవాడు; ఐన = అయిన; జనుండు = వాడు; వృద్ధ = పెద్దలను; గురు = గురువులను; సేవన్ = సేవించుట; చేసి = చేసి; మేధస్ = బుద్ధి; నయః = నీతి; ఉపక్రాంతిన్ = ప్రారంభమగుటచేత; విలసిల్లు = ప్రకాశించును; మీదటన్ = ఆ పైన; వయః = వయస్సు; పాకంబు = పరిపక్వమగుట; తోన్ = తో; బాలకున్ = పిల్లవానిని; శక్ర = ఇంద్రుని; ద్వేషణ = ద్వేషించెడి; బుద్దున్ = బుద్ధిగలవానిని; చేయుము = చేయుము; మదిన్ = మనసున; చాలింపుము = ఆపుము; ఈ = ఈ; రోషమున్ = క్రోధమును; శుక్రాచార్యులు = శుక్రాచార్యులు; వచ్చున్ = వచ్చెడి; అంత = సమయమున; కున్ = కు; ఇతడున్ = ఇతడుకూడ; సు = మంచితనము యనెడి; శ్రీ = సంపద; యుతుండు = కలవాడు; అయ్యెడున్ = కాగలడు.
భావము:
“రాక్షసరాజా! ఎంతటి వంకర బుద్దితో
అల్లరిచిల్లరగా తిరిగేవాడు అయినా, పెద్దలు గురువులు దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా. ఆ తరువాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. ఇప్పుడు కోప్పడ వద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే
లోపల మంచి గుణవంతుడు
అవుతాడు. ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతారు.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment