Monday, December 7, 2015

ప్రహ్లాద చరిత్ర - ఒజ్జలు చెప్పని



hiranyakasiap-prahlad.jpg7-178-వచనము
అనిన గురునందనుం గోపింపక దైత్యవల్లభుండు గొడుకు నవలోకించి యిట్లనియె.
7-179-కంద పద్యము
జ్జలు చెప్పని యీ మతి
జ్జాతుఁడవైన నీకు ఱి యెవ్వరిచే
నుజ్జా మయ్యె బాలక!
జ్జనులం బేరుకొనుము నా మ్రోలన్.
            ఇలా శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు అనేటప్పటికి, ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు కోపం విడిచి పెట్టాడు. తన కొడుకుని ఇలా అడిగాడు. ప్రహ్లాదా! నువ్వేమో చిన్న పిల్లాడివి. ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్ప లేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్లెవరో నాకు చెప్పు.”
७-१७८-वचनमु
अनिन गुरुनंदनुं गोपिंपक दैत्यवल्लभुंडु गोडुकु नवलोकिंचि यिट्लनिये.
७-१७९-कंद पद्यमु
ओज्जलु चेप्पनि यी मति
मज्जातुँडवैन नीकु मर्रि येव्वरिचे
नुज्जात मय्ये बालक!
तज्जनुलं बेरुकोनुमु तग ना म्रोलन्.
         అనినన్ = అనగా; గురునందనున్ = ఆచార్యుని పుత్రులను; కోపింపకన్ = కోపపడక; దైత్యవల్లభుండు = హిరణ్యకశిపుడు {దైత్యవల్లభుడు - దైత్యులకు వల్లభుడు (భర్త), హిరణ్యకశిపుడు}; కొడుకున్ = పుత్రుని; అవలోకించి = చూసి; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
          ఒజ్జలు = గురువులు; చెప్పని = చెప్పనట్టి; = ఇట్టి; మతి = బుద్ధి; మత్ = నాకు; జాతుడవు = పుట్టినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; మఱి = ఇంక; ఎవ్వరి = ఎవరి; చేన్ = వలన; ఉజ్జాతము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; బాలక = పిల్లవాడ; తత్ = అట్టి; జనులన్ = వారిని; పేరుకొనుము = చెప్పుము; తగన్ = శ్రీఘ్రమే; నా = నా; మ్రోలన్ = ఎదుట.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: