7-209-క.
ఆటలకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాటకులేంద్రకుమారుఁడు
పాటవమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై.
టీకా:
ఆటల
= క్రీడల; కున్ = కు; తన్ను = తనను; రమ్ము = రావలసినది; అని = అని; పాటించి = బతిమాలి; నిశాట = రాక్షస; సుతులు = బాలురు; భాషించినన్ = అడుగగా; దోషాట = (దోషవర్తనగల) రాక్షస; కుల = వంశ; ఇంద్ర = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; పాటవమున = నేర్పుతో; వారిన్ = వారిని; చీరి = పిలిచి; ప్రజ్ఞ = తెలివి; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:
అతనితో చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోడానికి రమ్మని పిలిచారు. అప్పుడు దోషాచారులు దానవుల చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన
ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా
ఇలా చెప్పసాగాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment