7-176-ఉత్పలమాల
తప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్
చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సు
మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష యెవ్వరుం
జెప్పెడిపాటి గాదు ప్రతిచింతఁ దలంపుము నేర్పుకైవడిన్.
7-177-కంద పద్యము
మిత్రులము పురోహితులము
పాత్రుల మే మదియుఁ గాక భార్గవులము నీ
పుత్రుని నిటువలెఁ జేయఁగ
శత్రులమే దైత్యజలధిచంద్రమ! వింటే.
“ఓ
రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు.
నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు
చెప్పము, చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ
వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం
దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించు. ఓ రాక్షసరాజా! నువ్వు రాక్షస కులం అనే
సముద్రానికి చంద్రుని వంటి వాడవు. వినవయ్యా! మేము నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము,
మంచి యోగ్యులము. అంతే కాదు భృగు వంశం వంశీయులము.
మేము నీకు మేలు కోరే వాళ్ళము తప్ప, నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము
శత్రువులము కాదయ్యా!”
७-१७६-उत्पलमाल
तप्पुलु लेवु मावलन दानवनाथ! विरोधिशास्त्रमुल्
चेप्पमु क्रूरुलै परुलु चेप्परु मी चरणंबुलान सु
म्मेप्पुडु मी कुमारुनकु निंतयु नैजमनीष येव्वरुं
जेप्पेडिपाटि गादु प्रतिचिंतँ दलंपुमु नेर्पुकैवडिन्.
७-१७७-कंद पद्यमु
मित्रुलमु पुरोहितुलमु
पात्रुल मे मदियुँ गाक भार्गवुलमु नी
पुत्रुनि निटुवलेँ जेयँग
शत्रुलमे दैत्यजलधिचंद्रम! विंटे.
తప్పులు = తప్పులు; లేవు = చేయబడలేదు; మా = మా; వలన = చేత; దానవనాథ = రాక్షసరాజా; విరోధి = శత్రువుల; శాస్త్రముల్ = చదువులు; చెప్పము = చెప్పలేదు; క్రూరులు = క్రూరమైనవారు; ఐ = అయ్యి; పరులు = ఇతరులు ఎవరును; చెప్పరు = చెప్పలేదు; మీ = మీ యొక్క; చరణంబులు = పాదముల; ఆన = మీద వట్టు; సుమ్ము = సుమా; ఎప్పుడున్ = ఎప్పుడును; మీ = మీ; కుమారున్ = పుత్రుని; కున్ = కి; నైజ = సహజసిద్ధమైన; మనీష = ప్రజ్ఞ, బుద్ధి; ఎవ్వరున్ = ఎవరుకూడ; చెప్పెడిపాటి = చెప్పగలంతవారు; కాదు = కాదు; ప్రతి = విరుగుడు; చింతన్ = ఆలోచన; తలంపుము = విచారింపుము; నేర్పు = మంచి నేర్పైన; కై = కోసము; వడిన్ = శ్రీఘ్రమే.
మిత్రులము = స్నేహితులము; పురోహితులము = ఆచార్యులము; పాత్రులము = తగినవారము; అదియుగాక = అంతేకాకుండగ; భార్గవులము = భృగువు వంశపు వారము; నీ = నీ యొక్క; పుత్రుని = కుమారుని; ఇటు = ఈ; వలెన్ = విధముగ; చేయగన్ = చేయుటకు; శత్రువులమే = విరోధులమా ఏమి; దైత్యజలనిధిచంద్రమ = హిరణ్యకశిపుడ {దైత్యజలనిధిచంద్రమ - దైత్య (దానవ) కులమనెడి జలనిధి (సముద్రమునకు) చంద్రమ (చంద్రునివంటివాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment