Saturday, December 5, 2015

ప్రహ్లాద చరిత్ర - పటుతరనీతిశాస్త్రచయ

7-173-చంపకమాల
టుతరనీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ
టు గొనిపోయి వానికి ర్హము లైన విరోధిశాస్త్రముల్
కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్
కట! బ్రాహ్మణాకృతివి గా యథార్థపు బ్రాహ్మణుండవే?

hiranyakasiap-prahlad-1.jpg            నదురు బెదురు లేకుండా కొడుకు చెప్పిన మాటలు విని హిరణ్యకశిపుడు గురువును ఇలా ప్రశ్నిస్తున్నాడునా కొడుకుని తీసుకెళ్లి నీతి యైన పాఠాలు బాగా నేర్పుతాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువైన విష్ణుమూర్తి కథలు నూరిపోశావా. అయ్యయ్యో! పవిత్రమైన భృగువంశంలో పుట్టిన వాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను కదయ్యా. బ్రాహ్మణ ఆకారంలో ఉన్నవు కాని నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే సరైన చదువు చెప్తానని ఇలా మోసం చేస్తావా?

७-१७३-चंपकमाल
पटुतरनीतिशास्त्रचय पारगुँ जेसेद नंचु बालु नी
वटु गोनिपोयि वानिकि ननर्हमु लैन विरोधिशास्त्रमुल्
कुटिलतँ जेप्पिनाँडवु भृगुप्रवरुंड वटंचु नम्मितिन्
कटकट! ब्राह्मणाकृतिवि गाक यथार्थपु ब्राह्मणुंडवे?

          పటుతర = మిక్కిలి దృఢమైన {పటు - పటుతరము - పటుతమము}; నీతి = నీతి; శాస్త్ర = శాస్త్రముల; చయ = అన్నిటిని; పారగున్ = చివరదాకచదివినవానినిగా; చేసెదన్ = చేసెదను; అంచున్ = అనుచు; బాలున్ = పిల్లవానిని; నీవు = నీవు; అటు = అలా; కొనిపోయి = తీసికెళ్ళి; వాని = వాని; కిన్ = కి; అనర్హములు = తగనట్టివి; ఐన = అయిన; విరోధి = పగవాని; శాస్త్రముల్ = చదువులు; కుటిలతన్ = కపటత్వముతో; చెప్పినాడవు = చెప్పితివి; భృగు = భృగువు వంశపు; ప్రవరుండవు = శ్రేష్ఠుడవు; అటంచున్ = అనుచు; నమ్మితిని = నమ్మితిని; కటకట = అయ్యో; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; ఆకృతివి = రూపుధరించినవాడవు; కాక = అంతేకాని; యథార్థపు = నిజమైన; బ్రాహ్మణుండవే = బ్రాహ్మణుడవేనా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: