7-183-శార్దూల విక్రీడితము
శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణిసాంగత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్రవాంఛామద
క్రోధోల్లోల విశాల సంసృతిమహాఘోరామితాంభోనిధిన్.
7-184-వచనము
అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువచేయక రక్కసుల ఱేఁడు దన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేఁడిచూపుల మింట మంట లెగయ మంత్రులం జూచి యిట్లనియె.
ఓ తండ్రీ! దానవేంద్రా! శాస్త్రాలు, కథలూ గాథలూ అన్ని చదివి మధించాను. ఈ సంసారం
ఒక భయంకరమైన మహా సముద్రం వంటిది; ఈ సంసార సాగరంలో భార్యా పుత్రులు
తిమింగలాలు; కామం, క్రోధం మొదలైనవి
ఉగ్రమైన కెరటాలు. ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి, అనవసరమైన వాదప్రతివాదాలు
తోటి సాధ్యం కాదు; ఈ చదువు సంధ్యలు ఏవీ,
ఎందుకూ పనికి రావు;
ఒక్క హరిభక్తి
అనే నౌక మాత్రమే తరింపజేయగలదు.” ఇలా
పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర
ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు.
మిక్కిలి కోపంతో కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుండగా, మంత్రులతో ఇలా అన్నాడు.
७-१८३-शार्दूल
विक्रीडितमु
शोधिंपंबडे
सर्वशास्त्रमुलु रक्षोनाथ! वे येटिकिन्
गाथल्
माधवशेमुषीतरणिसांगत्यंबुनं गाक दु
र्मेधन्
दाँटँग वच्चुने सुतवधूमीनग्रवांछामद
क्रोधोल्लोल
विशाल संसृतिमहाघोरामितांभोनिधिन्.
७-१८४-वचनमु
अनि पलिकिन
कोडुकुनु धिक्करिंचि मक्कुवचेयक रक्कसुल र्रेँडु दन तोडलपै नुंडनीक गोब्बुन
दिगद्रोब्बि निब्बरंबगु कोपंबु दीपिंप वेँडिचूपुल मिंट मंट लेगय मंत्रुलं जूचि
यिट्लनिये.
శోధింపంబడె = పరిశోధింపబడినవి; సర్వ = సమస్తమైన; శాస్త్రములున్ = చదువులును; రక్షోనాథ = రాక్షసరాజా; వేయి = అనేకమాటలు; ఏటికిన్ = ఎందులకు; గాథల్ = కథలు; మాధవ = నారాయణుని; శేముషి = చింత యనెడి; తరణి = నావ; సాంగత్యంబునన్ = సంబంధమువలన; కాక = కాకుండగ; దుర్మేధన్ = దుష్టబుద్ధితో; దాటగన్ = తరించుటకు; వచ్చునే = అలవియగునా యేమి; సుత = పిల్లలు; వధూ = పెండ్లాము యనెడి; మీన = జలజంతువులు; ఉగ్ర = తీవ్రమైన; వాంఛ = కోరికలు; మద = గర్వము; క్రోధ = కోపము యనెడి; ఉల్లోల = పెద్ద తరంగములుగల; సంసృతి = సంసారము యనెడి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; అమిత = కడలేని; అంభోనిధిన్ = సముద్రమును;
అని = అని; పలికిన = అనుచున్న; కొడుకును = పుత్రుని; ధిక్కరించి = తిరస్కరించి; మక్కువ = గారాబము; చేయక = చేయకుండగ; రక్కసులఱేడు = రాక్షసరాజు; తన = తనయొక్క; తొడల = తొడల; పైన్ = మీద; ఉండనీక = ఉండనీయక; గొబ్బునన్ = వేగముగా; దిగన్ = దిగిపోవునట్లు; ద్రొబ్బి = పడదోసి; నిబ్బరంబు = మిక్కుటము; అగు = అయిన; కోపంబు = కోపము; దీపింపన్ = జ్వలించుచుండగ; వేడి = వేడి; చూపులన్ = చూపులమ్మట; మింటన్ = ఆకాశమున; మంటలు = మంటలు; ఎగయన్ = చెలరేగ; మంత్రులన్ = మంత్రులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment