Saturday, October 31, 2015

ప్రహ్లాద చరిత్ర - పగవారైన

7-119-మత్తేభ విక్రీడితము
పగవారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాదసంకాశులన్
సుగుణోపేతుల నెందు నే మెఱుఁగ మంచున్ వృత్తబంధంబులం
బొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స
ద్భగవద్భక్తులు దైత్యరాజతనయుం బాటించి కీర్తింపరే?

७-११९-मत्तेभ विक्रीडितमु
पगवारैन सुरेंद्रुलुन् सभललोँ ब्रह्लादसंकाशुलन्
सुगुणोपेतुल नेंदु ने मेर्रुँग मंचुन् वृत्तबंधंबुलं
बोगडं जोत्तुरु सत्कवींद्रुल क्रियन् भूनाथ! मीबोँटि स
द्भगवद्भक्तुलु दैत्यराजतनयुं बाटिंचि कीर्तिंपरे?

         పగవారు = శత్రువులు; ఐనన్ = అయినను; సుర = దేవతా; ఇంద్రులున్ = ప్రభువులుకూడ; సభల్ = సభలు; లోన్ = అందు; ప్రహ్లాద = ప్రహ్లాదునికి; సంకాశులన్ = సమానమైనవారిని; సుగుణ = మంచిగుణములు; ఉపేతులన్ = కలవారిని; ఎందున్ = ఎక్కడను; నేము = మేము; ఎఱుంగము = తెలియము; అంచున్ = అనుచు; వృత్త = పద్యవృత్తములందు; బంధంబులన్ = కూర్చబడినవానిలో; పొగడన్ = స్తుతించ; చొత్తురు = ప్రారంభించిరి; సత్ = మంచి; కవీంద్రులన్ = కవులవలె; క్రియన్ = వలె; భూనాథ = రాజా {భూనాథుడు - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు}; మీ = మీ; పోటి = వంటి; సత్ = నిజమైన; భగవత్ = భగవంతుని; భక్తులు = భక్తులు; దైత్యరాజతనయున్ = ప్రహ్లాదుని; పాటించి = లక్షించి; కీర్తింపరే = స్తుతింపరా ఏమి.

ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇంక మీలాంటి భాగవతత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: