10.1-684-క.
లోక జనిస్థితిలయములు
గైకొని
చేయుదువు త్రిగుణకలితుఁడవై కా
లాకారమున
నమోఘ
శ్రీకలితుఁడ
వగుచు నిచ్చ చెందక యీశా!
లోక = జగత్తునకు; జని = బ్రహ్మరూపమున
సృష్టి; స్థితి = విష్ణురూపమునపాలన; లయములు
= శివరూపమునలయము; కైకొని = స్వీకరించి; చేయుదువు = నీవే ఆచరించెదవు; త్రిగుణ =
మూడుగుణములుతోడ {త్రిగుణములు - 1శాంతవృత్తిగల
సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల
తమోగుణము అనెడి మూడుగుణములు}; కలితుండవు = కూడుకొన్నవాడవు;
ఐ = అయ్యి; కాల = కాలము యొక్క {కాలము - నిమేష ప్రళయాది రూపములు కలది, సర్వము
కలిగించెడిది}; ఆకారమునన్ = స్వరూపముతో; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; శ్రీ = షడ్గుణైశ్వర్యములు; కలితుడవు = కలవాడవు;
అగుచున్ = అగుచు; నిచ్చన్ = అపేక్షను; చెందక = పొందక; ఈశా = కృష్ణా {ఈశుడు
- బ్రహ్మాదులను సృష్ట్యాది కార్యములందు నియమించు వాడు, విష్ణువు}.
१०.१-६८४-क.
लोक
जनिस्थितिलयमुलु
गैकोनि चेयुदुवु
त्रिगुणकलितुँडवै का
लाकारमुन नमोघ
श्रीकलितुँड वगुचु
निच्च चेंदक यीशा!
పరమేశ్వరా!
నీవు తిరుగులేని అష్టైశ్వర్యాలూ కలవాడవు. కాల స్వరూపుడవు. త్రిగుణాలను అవలంభించిన
వాడవు. అయినట్టి నీవు ఎట్టి అపేక్ష పొందక, ఈ లోకాలను
అన్నిటినీ పుట్టిస్తూ, నిలబెట్టుతూ, నశింపచేస్తూ
ఉంటావు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment