10.1-672-మ.
కచబంధంబులు
వీడ భూషణము లాకంపింపఁ గౌఁదీవియల్
కుచయుగ్మంబుల
వ్రేగునం గదలఁ బైకొంగుల్ వడిన్ జారఁగాఁ
బ్రచురభ్రాంతిఁ
గలంగి ముందట రుదద్బాలావళిం గొంచు స్రు
క్కుచు, భక్తింజని కాంచి రా గుణమణిన్ గోపాలచూడామణిన్.

१०.१-६७२-म.
कचबंधंबुलु वीड
भूषणमु लाकंपिंपँ गौँदीवियल्
कुचयुग्मंबुल
व्रेगुनं गदलँ बैकोंगुल् वडिन् जारँगाँ
ब्रचुरभ्रांतिँ
गलंगि मुंदट रुदद्बालावळिं गोंचु स्रु
क्कुचु, भक्तिंजनि कांचि रा
गुणमणिन् गोपालचूडामणिन्.
కాళియుని
భార్యల కొప్పుముడులు జారిపోతున్నాయి. వారి ఆభరణాలు చెదిరిపోతున్నాయి. స్తనాల
బరువుకు తీగలాంటి నడుములు అల్లాడిపోతున్నాయి. పైటకొంగులు జారి పోతున్నాయి. దిక్కు
తోచని భ్రాంతితో కలవర పడిపోతున్నారు. గొల్లున ఏడుస్తున్న పిల్లలను ముందు
పెట్టుకొని సుగుణాలశ్రేష్ఠుడు గోపాలశేఖరుడు అయిన కృష్ణుని వారు భక్తిపూర్వకంగా
దర్శనం చేసుకొన్నారు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment