10.1-692-చ.
"మలఁకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్;
ఖలులము; రోషజాతులము; గర్వుల; మే మొక మంచివారమే?
నళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే?
వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా!
ఖలులము; రోషజాతులము; గర్వుల; మే మొక మంచివారమే?
నళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే?
వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా!
మలకలు = వంకరలైనవి; మా = మా యొక్క; ప్రచారములు = నడకలు; మా = మా యొక్క; ముఖములు = మోములు; విష = విషము అనెడి; అగ్ని = అగ్నితో; ఘోరముల్ = భయంకరమైనవి; ఖలులము = దుష్టులము; రోష = కోపముతోనే; జాతులము = పుట్టినవారము; గర్వులము = అహంకారము కలవారము; మేమున్ = మేము; ఒక = కొంచమైనా; మంచివారమే = మంచివాళ్ళమా, కాదు; నళినదళాక్ష = కృష్ణా {నళినదళాక్షుడు - నళిన (తామర) దళ (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; ప్రాణుల్ = జంతువుల; కున్ = కు; నైజ = స్వభావమువలనకలిగిన; గుణంబులు = లక్షణములు; మానన్ = పోవుట; నేర్చునే = సాధ్యమా, కాదు; వెలయవె = ప్రసిద్దములుకావా, అవును; మా = మా యొక్క; వికారములు = దుష్టచేష్టలు; వింతలె = విచిత్రమైనవా, కాదు; మేలు = మంచి; ఒనరించితి = చేసితివి; ఈశ్వరా = కృష్ణా.
“కమలలాంటి కన్నులున్న శ్రీకృష్ణా! పరమేశ్వరా! మావి వంకరటింకర నడకలు. మా నోర్లు విషాగ్నులతో ఘోరమైనవి. మేము దుష్టులము, పొగరుబోతలము. మా జాతే రోషపు జాతి. ఇంకా మేం మంచివారిలా ఎలా ఉండగలము. ఈ సృష్టిలోని జీవులు తమ సహజగుణాలు మార్చుకోలేవు కదా. అవి స్థిరంగా ఉండిపోతాయి కదా. మేం వికృత చేష్టలు చేయటం వింతేమి కాదు గదా. అయినా ఇవాళ నాకు చాలా ఉపకారం చేసావు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=85&Padyam=692.0: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment