10.1-694-క.
నా పుణ్య మేమి చెప్పుదు?
నీ పాదరజంబుఁ గంటి నే; సనకాదుల్
నీ పాదరజముఁగోరుదు
రే పదమందున్న నైన నిట మేలు హరీ!"
నా = నా యొక్క; పుణ్యము = అదృష్టము; ఏమి = ఏమని; చెప్పుదు = చెప్పగలను; నీ = నీ యొక్క; పాద = కాలి; రజంబున్ = దుమ్మును; కంటిన్ = పొందితిని; నేన్ = నేను; సనకాదుల్ = పరమఋషులు {సనకాదులు - సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు}; నీ = నీ యొక్క; పాద = పాద; రజమున్ = ధూళిని; కోరుదురు = అపేక్షింతురు; ఏ = ఏ; పదము = స్థానము; అందున్ = లో; ఉన్ననైనన్ = ఉండినను; ఇటన్ = ఇకమీద; మేలు = మంచిదే; హరీ = కృష్ణా.
10.1-694-क.
ना पुण्य मेमि चెप्पुदु?
नी पादरजंबुँ गंटि ने; सनकादुल्
नी पादरजमुँगोरुदु
रे पदमंदुन्न नैन निट मेलु हरी!"
ना पुण्य मेमि चెप्पुदु?
नी पादरजंबुँ गंटि ने; सनकादुल्
नी पादरजमुँगोरुदु
रे पदमंदुन्न नैन निट मेलु हरी!"
శ్రీహరీ! సనకసనందాది దివ్యమునులు కూడ నీ పాద ధూళినే కావాలని కోరుకుంటారు. అలాంటి నీ పాదధూళి నేను పొందగలిగాను. నా పుణ్యం ఎంత గొప్పదో కదా? ఇంక నేను ఏ స్థితిలో ఉన్నా సరే నాకు శోభనమే.”
చదువుకుందాం భాగవతం - బాగుపడదాం మనం అందరం
No comments:
Post a Comment