10.1-685-క.
ఈ శాంతులు
గాని తనువు
లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్
ఈశాంత
తనువులందుఁ బ్ర
కాశింతువు
ధర్మహితముగా సుజనులలోన్.
ఈ = ఈ కనబడుచున్న; శాంతలుగాని = శాంతాది సద్గుణములు లేని;
తనువులు = దేహధారి జీవులు; ఈశా = సర్వ భోక్త,
కృష్ణా; ఈ = ఈ కనబడుచున్న; మూఢ = నీ స్వరూప ఙ్ఞానము లేని; జాతులు = జన్ములు;
ఈ = ఈ కనబడుచున్న; సఙ్ఞాతుల్ = నీ స్వరూప ఙ్ఞాన
మున్నవి; ఈ = ఈ కనబడుచున్న; శాంత =
శాంతాది సద్గుణములు కల; తనువులు = దేహధారి జీవులు; అందున్ = అందు; ప్రకాశింతువు = వెలిగెదవు; ధర్మ = వర్ణాచారములకు; హితముగా = మేలు కలుగుటకు;
సుజనుల = సజ్జనుల; లోన్ = అందు.
१०.१-६८५-क.
ई शांतुलु गानि तनुवु
लीशा! यी मूढजातु ली सज्जातुल्
ईशांत तनुवुलंदुँ ब्र
काशिंतुवु धर्महितमुगा
सुजनुललोन्.
ఈశ్వరా! నీవు శాంతి
లేని వారిలోను, మూఢులైన వారి లోను, ఙ్ఞానులైన
వారిలోను, ఈశ్వరుడే తుదగా జీవించే వారి లోను అందరిలోను
ప్రకాశిస్తుంటావు. కాని ధర్మానికి మేలు చేయటం కోసం మంచి వాళ్ళలో తరచుగా
ప్రకాశిస్తావు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment