Saturday, October 3, 2015

కాళియ మర్దన - పగవారి

10.1-675-క.
వారి సుతుల యందును
 యించుక లేక సమతఁ రగెడి నీకుం
గలదె? ఖలుల నణఁచుట
దవనముకొఱకుఁ గాదె గదాధారా!
          పగవారి = శత్రులు యొక్క; సుతులన్ = బిడ్డలను; అందునున్ = ఎడల; పగ = శత్రుత్వము; ఇంచుక = కొద్దిగా కూడ; లేకన్ = లేకుండగ; సమతన్ = సమభావమున; పరగెడి = మెలగెడి; నీ = నీ; కున్ = కు; పగ = శతృభావము; కలదె = ఉన్నదా, లేదు; ఖలులన్ = దుష్టులను; అణచుట = శిక్షించుట; జగత్ = లోకమునకు; అవనము = రక్షించుట; కొఱకున్ = కోసము; కాదె = కాదా, అవును; జగదాధరా = కృష్ణా {జగదాధారుడు - జగత్తునకు ఆధారభూతమైనవాడు, విష్ణువు}.
१०.१-६७५-क.
पगवारि सुतुल यंदुनु
बग यिंचुक लेक समतँ बरगेडि नीकुं
बगगलदे? खलुल नणँचुट
जगदवनमुकोर्रकुँ गादे जगदाधारा!
            సమస్త లోకాలకు ఆధారభూతమైనవాడా! శ్రీకృష్ణా! శత్రువుల కొడుకులందు సైతము కొంచం కూడ శత్రుత్వం చూపకుండ నీవు సమానత్వం చూపుతావు. నీకు పగ అన్నది  లేదు కదా. నీవు దుష్టులను శిక్షించుట లోకాలను రక్షంచడానికే కదా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: