Wednesday, October 7, 2015

కాళియ మర్దన - ఒల్లరు

10.1-679-ఉ.
ల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా
నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము
న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ
ల్లలితాంఘ్రిరేణువులసంగతి నొందిన ధన్యు లెప్పుడున్.
          ఒల్లరు = అంగీకరించరు; నిర్జరేంద్ర పదము = దేవేంద్ర పదవిని; ఒల్లరు = అంగీకరింపరు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పదంబున = పదవు; ఒందగా = పొందుటకు; ఒల్లరు = అంగీకరించరు; చక్రవర్తి = సార్వభౌమ; పదమున్ = స్థానమును; ఒల్లరు = అంగీకరింపరు; సర్వ = సమస్తమైన; రస = భూమండలమును; అధిపత్యమున్ = ఏలెడిఅధికారమును; ఒల్లరు = అంగీకరించరు; యోగ = యోగసాధనలో; సిద్ధిన్ = సాఫల్యమును; మఱి = మరి; ఒండు = ఇంకొక; భవంబులన్ = జన్మలను; ఒందనీని = పొందనియ్యని; నీ = నీ యొక్క; సత్ = ప్రశస్తమైన; లలిత = మనోజ్ఞమైన; అంఘ్రి = పాద; రేణువుల = ధూళితోడి; సంగతిన్ = కూడికను; ఒందిన = పొందినట్టి; ధన్యులు = కృతార్థులు; ఎప్పుడున్ = ఎప్పుడైనను.
१०.-६७९-.
ओल्लरु निर्जरेंद्रपद मोल्लरु ब्रह्मपदंबु नोंदँगा
नोल्लरु चक्रवर्तिपद मोल्लरु सर्वरसाधिपत्यमु
न्नोल्लरु योगसिद्धि मर्रियोंडु भवंबुल नोंदनीनि नी
सल्ललितांघ्रिरेणुवुलसंगति नोंदिन धन्यु लेप्पुडुन्.
            అతి మనోఙ్ఞము లైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు ఎప్పటికి మరొక పునర్జన్మను పొందరు. అట్టి ధన్యులు ఎప్పుడూ దేవేంద్ర పదవికి కూడా ఇష్టపడరు. బ్రహ్మపదానికి కూడా ఇష్టపడరు. చక్రవర్తి, వరుణ పదవులకి కూడా ఒప్పుకోరు. యోగసిద్ధికి అయినా సరే ఒప్పుకోరు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: